Saturday, April 20, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌తో ర‌హ‌స్యంగా భేటీ అయిన నాగ‌ర్జున‌

- Advertisement -

హీరో అక్కినేని నాగ‌ర్జున సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజ‌కీయాల‌కు ఏమాత్రం సంబంధం లేని వ్య‌క్తి నాగ‌ర్జున‌. గ‌తంలో చాలాసార్లు నాగ‌ర్జున రాజ‌కీయ‌ల‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి ఆయ‌న దీనిపై స్పందించ‌లేదు. నాగ‌ర్జున రాజ‌కీయ‌ల‌లోకి ఎంట్రీ ఇస్తున్నార‌నే వార్త‌లు రావ‌డం వెన‌కు చాలానే త‌తంగం ఉంది. గ‌తంలో నాగ‌ర్జున వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్రచారం చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై పొలిటిక‌ల్ ఎంట్రీపై ర‌కార‌కాల వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం నాగ‌ర్జున పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయంగా క‌నిపిస్తుంది. నాగ‌ర్జున మొద‌టి నుంచి వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. దీంతోనే ఆయ‌న జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నాగర్జున ఇటీవ‌లే జ‌గ‌న్‌ను ర‌హ‌స్యంగా క‌లుసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ , నాగ‌ర్జున‌ను పార్టీలో చేరాల‌ని కోరినట్లు తెలుస్తుంది.

దీనికి నాగ్ నుంచి సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ట‌. అయితే పార్టీలో డైరెక్ట్ చేర‌కుండా ,జ‌గ‌న్ నిర్వ‌హించే బ‌స్సు యాత్ర‌లో తాను కూడా పాల్గొన్నాల‌ని భావిస్తున్నాడ‌ట నాగ‌ర్జున‌. కాని నాగ‌ర్జున‌ను గుంటురు జిల్లా నుంచి పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా నిల‌బెట్ట‌లనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట జ‌గ‌న్‌.మ‌రి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌లోకి నాగ్ వస్తాడా అనేది అనుమాన‌మే. నాగ్ ప్ర‌త్య‌క్ష రాజకీయాల‌లోకి వ‌స్తే త‌రువాత వ‌చ్చే ప్ర‌భుత్వాలు త‌న ఆస్తుల‌ను టార్గెట్ చేస్తార‌నే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏ పార్టీలో చేర‌కుండా సైలెంట్‌గా ఉన్నారు. మ‌రి ఇప్పుడు నాగ్ ఓ పార్టీకే పరిమితం అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇప్ప‌టికే మంచు ఫ్యామిలీ స‌పోర్ట్ జ‌గ‌న్‌కే తెలిపారు. ఇక అక్కినేని ఫ్యామిలీ కూడా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపితే ఇండ‌స్ట్రీ నుంచి మ‌రి కొంద‌రు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంది. ఏది ఏమైన‌ప్ప‌టికి నాగ‌ర్జున మాత్రం వైఎస్‌ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు నిల‌వ‌డం ఖాయం అంటున్నారు వైసీపీ శ్రేణులు. మ‌రి ఈ విష‌యంపై స్ఫ‌ష్ట‌త రావ‌లంటే మాత్రం మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -