హీటెక్కిన అమ‌రావ‌తి రాజీకీయాలు…క్యూ క‌డుతున్న నేత‌లు

266
All Parties leaders Reaching to Amravati
All Parties leaders Reaching to Amravati

రేపు 23న ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ళ‌తో అమ‌రావ‌తి రాజ‌కీయాలు వేడెక్కాయి. అన్ని రాజ‌కీయ పార్టీల అధినేత‌లు, నాయ‌కులు అంద‌రూ క్యూక‌ట్టారు.జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకుని, సమీక్షలు నిర్వహిస్తుండగా, సాయంత్రానికి వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు.

ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రేణిగుంటకు చేరుకోనున్న చంద్రబాబు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి తిరిగి రాత్రికి అమరావతికి రానున్నారు. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుండటంతో ఏపీలో రాజకీయ వేడి ఇప్పుడు అమరావతికి మారింది. రేప‌టి దినాన ఎవ‌రు జీరోల‌వుతారో ఎవ‌రు హీరోల‌వుతారో కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

Loading...