Tuesday, April 23, 2024
- Advertisement -

ఆళ్ల‌గ‌డ్డ బ‌రిలో గెలుపు ఎవ‌రిదంటె..?

- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గం గెల‌పుపైనె అంద‌రి చూపు. ఎందుకంటె వైసీపీ నుంచి గంగుల‌, టీడీపీనుంచి భూమాకుటుంబం బ‌రిలోకి దిగుతోంది. ఇద్ద‌రికి గెలుపు అంత సుల‌భం కాద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నా ..విశ్లేష‌కులు మాత్రం గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా వైసీపీకే ఉంటాయంటున్నారు. దానికి కార‌ణం భూమా వ‌ర్గం అంతా ఇప్పుడు వైసీపీకీ స‌పోర్ట్ చేస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించిన త‌ర్వాత టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక‌లు ఉండ‌టంతో బాబు అఖిల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఆత‌ర్వాత స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి. అఖిల దుందుడుకు స్వ‌భావం, ఎవ‌రిని లెక్క చేయ‌క‌పోవ‌డం లాంటి నిర్ణ‌యాల‌తో అండ‌గా ఉన్న నాయ‌కులంద‌రూ దూరం అయ్యారు.

ప్ర‌స్తుతం వైసీపీ త‌రుపున గంగుల ప్రభాకర రెడ్డి కుమారుడు బ్రిజేంద్ర రెడ్డి బరిలో దిగ‌గా …టీడీపీ నుంచి మంత్రి అఖిల ప్రియ బ‌రిలోకి దిగుతున్నారు. ఇద్ద‌రి కుటుంబాలకు బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌ధ్యం ఉండ‌టంతో ఫైట్ ట‌ప్‌గా ఉండ‌నుండ‌టంలో సందేహంలేదు.

గెలుపు అవ‌కాశాల ప‌రంగా చూస్తె…వైసీపీకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటె భూమా కుటుంబానికి అండ‌గా ఉన్న వారంద‌రూ వైసీపీలోకి వ‌చ్చారు. భూమాకు స‌న్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అఖిల‌పై గుర్రుగా ఉన్నారు. గ‌తంలో ఇద్ద‌రి మ‌ధ్య జరిగిన ఆధిప‌త్య‌పోరు సంగ‌తి తెలిసిందే. ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడా వైసీపీలో చేరారు. తాజాగా అఖిల మేన‌మాక క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి మ‌ళ్లీ సొంత గూటికి చేర‌నున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అఖిల‌కు స‌పోర్ట్ చేస్తారా చేయ‌రా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ప‌రంగా చూసుకుంటె విజ‌యావ‌కాశాలు గంగుల కుటుంబానికే మెండుగా ఉన్నాయి. మ‌రి ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌లు ఎవ‌రిని ఆదిర‌స్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -