Friday, April 19, 2024
- Advertisement -

జ‌గ‌న్ తో క‌మ‌లం బాస్‌ చ‌ర్చ‌లు.. 23 త‌ర్వాత ఏంజ‌ర‌గ‌బోతోంది..?

- Advertisement -

లోక్ స‌భ ఎన్నిక‌లు ఇంకా ముగియ‌లేదు. 2014లో సొంత మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజాపా ఈ సారి మాత్రం అందుకు అవ‌కాశాలు లేవ‌ని ఇప్ప‌టి రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ సారి ఖ‌శ్చితంగా కేంద్రంలో హంగ్ వస్తుందంటు రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టి నుంచె లెక్క‌లు వేసుకుంటున్నారు. హంగ్ వ‌స్తె ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రాంతాయ పార్టీలే ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి.

ఒక వేల కేంద్రంలో హంగ్ వ‌స్తె ఎందుకైనా మంచిద‌ని భాజాపా వైఎస్ జ‌గ‌న్ కు క‌న్ను గీటుతోంది. ఇప్ప‌టికే ఎన్డీయేతర పక్షాలతో చర్చలు ప్రారంభించిన పార్టీ చీఫ్ అమిత్ షా జ‌గ‌న్‌తో తెరవెనుక మంత్రాంగం జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతుందని, ఆ పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు కూడా వస్తాయంటూ కొందరు లెక్కలు వేస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని స‌ర్వేలు కూడా దాదాపు వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని 20 కి పైగా ఎంపీసీట్లు గెలుస్తుంద‌ని తేల్చి చెప్పాయి. ఇక భాజాపా చేసిన స‌ర్వేలో కూడా వైసీపీకీ 20 నుంచి 23 ఎంపీ సీట్ల‌ను, అలాగే 130 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుందంటూ అమిత్ షా త‌న అభిప్రాయాన్ని జ‌గ‌న్‌కు తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం.

ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడిన పక్షంలో వైసీపీ కీలకం అవుతుంది. 20 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, ఇప్పటి నుంచే వైఎస్ జగన్‌‌తో చర్చలు జరిపి రెడీగా పెట్టుకోవడం మంచిదనే ఉద్దేశంలో బీజేపీ నేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక 23న ఫ‌లితాల త‌ర్వాత రాష్ట్రం, కేంద్రంలో ఏం జ‌ర‌గ‌బోతోంద‌నె ఉత్కంఠ అంద‌రిలోను నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -