Friday, April 26, 2024
- Advertisement -

బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలు అన‌డానికి సాక్ష్యం మాజీ మంత్రి వ్యాఖ్య‌లేనా..?

- Advertisement -

వైఎస్ హ‌యాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగి టీడీపీలో చేరిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది. క‌నీసం కార్య‌క‌ర్త‌కు ఇచ్చే విలువ కూడా ఆయ‌న‌కు ఇవ్వ‌డంలేదంటే ప‌రిస్థితి ఎంత దిగ‌జారిపోయిందో ఆయ‌న మాట‌ల్లో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారా అన్న వార్త‌లు మ‌రోసారి బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇక ఆయ‌న ఓపిక న‌శించిందా…? గ‌తంలో వైకాపాలో చేరుతార‌నే వార్త‌లు మ‌రో సారి నిజం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా టీడీపీప్ర‌భుత్వం, బాబుపై చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే ఉన్నాయి.

ఇలాంటి మ‌హానాడులు పెట్టుకుని మ‌న‌కు మ‌న‌మే భ‌జ‌న చేసుకుంటూ పోతే స‌రిపోతుందా..’ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, బాబును కూడా దుమ్ముదులిపారు. బాబు పరిపాలనపట్ల 80శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అధికారులు చెప్పడం అబద్ధమన్నారు.

35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ ఇన్ని అవమానాలు పడలేదు’ అంటూ పైర్‌ అయ్యారంటే ఎంత కుతకుతలాడిపోతున్నారో అర్థమవుతోంది. రైతులు తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని డైరెక్టుగా ప్రభుత్వాన్ని అటాక్‌ చేశారు. ‘అధికార పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నా నా బ్యాటరీలో చార్జింగ్‌ లేదు’ అని వ్యంగ్యంగా అన్నారు. నేను కేవలం జెండా పట్టుకోవడానికే సరిపోతానా, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సరిపోతానా అర్థంకావడంలేదన్నారు.

నెల్లూరులో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిశెట్టి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఉన్నా.. ఏ ఒక్క స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. రైతులు చాలా బాధ‌లో ఉన్నారు. వారు తిరుగుబాటు చేసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి..’ అని ఆనం అన్నారు. ఎన్నో స‌మ‌స్య‌లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు చెప్పుకున్నా.. ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

టీడీపీలో చేరిన తరువాత ఆనం సోదరులకు అధినేత అన్యాయం చేసినా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు తప్ప బహిరంగంగా విమర్శలు చేసిన దాఖలాలులేవు. మ‌రి ఇప్పుడు బ‌హిరంగంగా బాబును విమ‌ర్శించ‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -