Thursday, April 25, 2024
- Advertisement -

ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థులు మృతి.. రాష్ట్రానికి రప్పించిన జగన్..!

- Advertisement -

కొందరు రాజకీయాల లబ్ది కోసం పరిపాలిస్తారు.. కొందరు మాత్రం ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు ఆనందపడుతున్నారు. దేశం సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నపుడు ఒక యువ ముఖ్యమంత్రి ప్రదర్శించిన అత్యుత్తమ దారిని అభినందించాల్సిందే. కరోనా వైరస్ విజృంభించి ఏ నిమిషం ఏం అవుతుందో తెలియని పరిస్థితి. కానీ కరోనాకు భయపడకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి వారికి ధైర్యం ఇచ్చాడు జగన్. ఇక ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్ అనే పదబంధాలను తొలిసారిగా సృష్టించింది జగనే కావడం విశేషం.

ఆ తరువాత ప్రధాని కూడా ఇవే పదాలను పలకడంతో ఈరోజు దేశం లోని అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇలా జగన్ ఎన్నో పనులు విజయవతంగా చేస్తున్నారు. తాజాగా జగన్ చేసిన ఓ పని గురించి తెలుస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కరోనా కారణంగా అన్ని ఆగిపోయాయి. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ తీసుకున్న ఓ నిర్ణయం.. ఆయన మంచితనం ఏంటో నిరూపించింది. ఫిలిపిన్స్ లో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వారు అనంతపురంకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ లుగా గుర్తించారు. వీరిద్దరు ఫిలిపిన్స్ లో ఎంబీబీఎస్ చదువుకునేందుకు వెళ్లారు. అయితే అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఇద్దరు స్టూడేంట్స్ తల్లిదండ్రులు అనంతపురం, కదిరిలో ఉన్నారు. తమ పిల్లల చివరి చూపు కూడా చూసుకోలేకపోతున్నాం అని ఆవేదన చెందారు.

అయితే ఈ సమయంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు నెలకొని ఉండడంతో వారి మృతదేహాల తరలింపు సాధ్యపడలేదు. ఎందుకంటే విమాన సర్వీస్ లు కూడా ఆగిపోవడం వల్ల. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఈ విషయం అనతపురం ఎమ్మెల్యేలు చెప్పారు. వెంటనే స్పందించిన జగన్ వారిని ఏపీకి తీసుకుని రావాలని నిర్ణయించుకుని.. కేంద్రంతో మాట్లాడారు. వెంటనే దాదాపుగా 74 లక్షలు ఖర్చు చేసి స్పెషల్ విమానంలో మృతదేహాలు అనంతపురం జిల్లా రప్పించారు. విగతజీవుల్లా వచ్చిన తమ బిడ్డలను చూసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ తల్లిదండ్రులకు తమ పిల్లల కడసారి చూపు దక్కేలా సీఎం జగన్ చేశారు. తమ పిల్లలను చివరి చూపు చూసుకునేలా చేసినందుకు జగన్ ను ఆ తల్లిదండ్రులు అభినందించారు. సీఎం జగన్ రెండు కుటుంబల కోసం ఇంతలా ఎఫెర్ట్ పెడుతారా అని అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -