Friday, March 29, 2024
- Advertisement -

టీడీపీ నుంచే పవన్, అస్మిత్ పోటీ

- Advertisement -

రాష్ట్ర రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ గురించి తెలియ‌ని వారుండ‌రు. మ‌రీ ముఖ్యంగా అనంత‌పురం రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్‌ది తిరుగులేని రాజ‌కీయాం. మొద‌టి నుంచి వారిదే ఆధిప‌త్యం. వైఎస్ మ‌ర‌ణానాంత‌రం టీడీపీలోకి ఫిరాయించారు. మీడియా ముందు ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది. మ‌న‌సులో ఏదీ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు చెప్ప‌డం వారి అల‌వాటు. రాష్ట్ర‌విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున అనంత‌పురం ఎంపీగా జేసీ దివాక‌ర్ రెడ్డి, తాడి ప‌త్రి ఎమ్మెల్యేగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిలు గెలిచారు.

అయితే కొద్ది నెల‌లు ఇద్ద‌రు నేత‌ల తీరుపై అక్క‌డి ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఓట‌మి త‌ప్ప‌ద‌నే కార‌ణంతో వారుసుల‌ను రంగంలోకి దింపేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు జేసీ బ్ర‌ద‌ర్స్‌. తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమ‌ని జేసీ బ్ర‌ద‌ర్స్ ప్రకటించి సంచ‌ల‌నాల‌కు తెర‌లేపారు.

తాజాగా దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని స్పష్టం చేశారు.

ఇక జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌న‌ని…. త‌న స్థానంలో త‌న కొడుకు ప‌వ‌న్ రెడ్డి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జేసీ బ్రదర్స్ తప్పుకున్నారని స్పష్టమైంది. దీంతో పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. అస్మిత్ రెడ్డి ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమం ద్వారా.. తాడిపత్రి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

జేసీ బ్రదర్స్ వారసులు కూడా రాజకీయంగా తమను తాము నిరూపించుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. అయితే బాబు జేసీ బ్ర‌ద‌ర్స్ నిర్ణ‌యాన్ని ఒప్పుకుంటా అన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి వారి అభ్యర్థిత్వాలకు ఎంతవరకూ జనామోదం ఉంటుందనే విషయం రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -