Thursday, April 25, 2024
- Advertisement -

పులివెందుల, కుప్పం మెజారిటీతో సహా డీటెయిల్డ్ సర్వే…. రిజల్ట్స్

- Advertisement -

చంద్రబాబు అండ్ బ్యాచ్ టైం అస్సలు బాగాలేదు. ఆ బ్యాచ్‌తో కలిసి కమ్ముక్కు, కుట్ర రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ ఏకంగా పార్టీ ఆఫీసులకు టులెట్ బోర్డ్స్ పెట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే పదిహేను ఆఫీసులకు టు లెట్ బోర్డ్స్ పెట్టారట. ఇక జాతీయ స్థాయిలో నుంచీ లోకల్ సర్వేల వరకూ అన్నీ కూడా చంద్రబాబు గుండె గుభేల్‌మనిపించే ఫలితాలే చెప్తున్నాయి. ఇప్పటికీ నాదే గెలుపు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే……….మరోవైపు ఓడిపోయిన అభ్యర్థిలా ఈవీఎంలు బాగాలేవు అని ఓటమికి సాకులు వెతుకుతున్న చంద్రబాబుకు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక సర్వే నిద్రలేని రాత్రులు మిగిల్చేలా కనిపిస్తుంది. ఒక ప్రముఖ సంస్థ త్వరలోనే ఈ సర్వేను అధికారికంగా ప్రకటించనుంది. అయితే ముందుగానే ఆ సంస్థ ఎంప్లాయి ఒకరు ఈ ఫలితాలను లీక్ చేసేశారు. ఆ సర్వే ఫలితాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ సర్వే సంస్థ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు గెలుస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అనే వివరాలతో ఒక నివేదికను రూపొందించింది.

ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వైసిపి 123 నుంచి 129
తెలుగుదేశం 32 నుంచి 43
జనసేన 1 నుంచి 2

వైసిపి అధినేత జగన్ సుమారు 85600 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుమారు 30000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలలోనూ 50 -50 ఛాన్సెస్ ఉన్నాయి. కచ్చితంగా గెలుస్తాడని చెప్పలేము.

వైసిపికి చెందిన పదిహేను మంది అభ్యర్థులు 25000 ఓట్ల పైచిలుకు మెజారిటీ సాధిస్తారు.

భీమవరంలో పవన్ ఓటమి ఖాయం అని ఓటింగ్‌కి ముందే అందరికీ తెలిసిపోయింది. ఇక గాజువాకలో కూడా డౌట్ అని ఈనాడునే చెప్పేసింది. అలాగే టిడిపి పరిస్థితి ఘోరంగా ఉండబోతోంది, లోకేష్ కూడా ఓడిపోతాడు అని జాతీయ మీడియా విశ్లేషించిన నేపథ్యంలో ఈ సర్వే వివరాలు మాత్రం నమ్మేవిధంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -