Thursday, April 25, 2024
- Advertisement -

40 సంత్స‌రాల అనుభం…ముష్టి 12 సీట్ల‌ కోసం ఇంత దిగ‌జారుడా..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడి నోటినుంచి ఎక్కువ‌గ వినిపించే మాట ఏదైనా ఉందంటే అది..దేశంలో నేనే సీనియ‌ర్ 40 సంత్స‌రాల రాజ‌కీయా అనుభ‌వం అని డంకా భ‌జాయించి సొంత డ‌బ్బా కొట్టుకుంటాడు. ప్ర‌ధానుల‌ను, రాష్ట్ర‌ప‌తుల‌ను నిర్ణ‌యించి బాబ‌కు తెలంగాణాలో మాత్రం త‌న పార్టీని కుక్క‌లు చింపి విస్త‌ర చేశారు. మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా సీట్ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీముందు బాబు మోక‌రిల్లారు.

ఒకొప్పుడు కాంగ్రెస్ పార్టీకీ వ్య‌తిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు బాబు సార‌థ్యంలో తెలంగాణాలో అధ‌మ‌స్థ‌తికి చేరింది. సీట్ల పంప‌కాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ముష్టి విదిలిస్తే అన్ని సీట్లతో సర్దుకుపొమ్మన్నట్టుగా పార్టీ నాయకులకు సందేశం ఇచ్చారు. దీన్ని బ‌ట్టి చూస్తే బాబు ఎంత దిగ‌జారిపోయారో తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని మట్టి కరపించడమే లక్ష్యంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ.. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగడానికి సిద్దపడి, బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న సమయంలో.. చంద్రబాబు ఇంకాస్త స్పష్టంగా పార్టీని దిగజార్చేశారు. నాయ‌కులు వేరే పార్టీ మారినా..క్యాడ‌ర్ బ‌లంగా ఉంద‌ని చెప్పుకొనే బాబు పోటీ విష‌యంలో మాత్రం చితికిల బ‌డ్డారు.

తెలంగాణా టీడీపీ నేత‌ల‌తో చ‌ద్ర‌బాబు స‌మావేశ మ‌య్యారు. స‌మావేశంలో 30 సీట్లు డిమాండ్ చేద్దామని టీటీడీపీ నేతలు సూచించినా…బాబు వినలేదట. కాంగ్రెస్ 12 సీట్లను ఇస్తామని చెబుతోందని – వాటితో సర్దుకొని మహాకూటమి గెలుపు కోసం కృషి చేయాలని టీటీడీపీ కార్యకర్తలకు బాబు దిశానిర్దేశం చేశారట.

చివరికి ఇంకా బొడ్డూడని తెలంగాణ జనసమితి కూడా.. కాంగ్రెస్ వైఖరికి విసిగిపోయి.. అవసరమైతే.. ప్రత్యామ్నాయం చూసుకోవాలనేంత దూకుడుగా వ్యవహరిస్తోంది. సీపీఐ కూడా అదే బాటలో ఉంది. ఇలా చిన్న పార్టీలు కూడా.. తమ ఇండివిడ్యువాలిటీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే.. తెలంగాణలో మూడో బలమైన పార్టీ అనుకోగల తెలుగుదేశం మాత్రం కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలకు దేబిరిస్తోంది. పార్టీని ఆయన ఎంత దిగజార్చేస్తున్నారో కదా అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -