జగనన్న చేదోడు పథకం ప్రారంభం.. నేరుగా అకౌంట్లలోకి రూ.10వేలు..!

783
Andhra Pradesh Cm Ys Jagan Launches Ysr Jagananna Chedodu Scheme
Andhra Pradesh Cm Ys Jagan Launches Ysr Jagananna Chedodu Scheme

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కోటి నెరవేరుస్తూ వస్తున్న సీం జగన్.. తాజాగా బుధవారం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాంను ప్రారంభించారు.

ఈ పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ)లకు రూ.10వేలు జమ చేయనున్నారు. షాపు ఉండి.. అర్హత ఉండి పథకం అమలు కాకపోయినా పర్లేదు.. డబ్బులు జమ కాకపోతే అలాంటివారికి ఇంకో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. అర్హత ఉన్నవారు.. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం ఒక నెల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. వారికి వచ్చే నెలలో డబ్బులు జమ చేస్తామని సీఎం చెప్పారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా, తనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే పథకం అందుతుందన్నారు. ఈ పథకం ద్వారా 2,47,040 మందికి మొత్తం రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వివరించారు. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు.

కేసీఆర్ సంచలన నిర్ణయం : పదో తరగతి విద్యార్థులు పాస్..!

గుండెలు బాదుకునోళ్లు.. సిగ్గుతో బిగుసుకు పోయారు

జగన్ పై మళ్లీ విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

నాగబాబు అభిప్రాయాలతో మాకు లింక్ లేదు : పవన్ కల్యాణ్

Loading...