Thursday, April 25, 2024
- Advertisement -

ఢిల్లీ లో ఆంధ్రా లొల్లి… నువ్వా నేనా..?

- Advertisement -

ఏ రాష్ట్రంలో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీ లు ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమే.. అయితే అది రాష్ట్రంలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఢిల్లీ లో అసలే రాష్ట్రాలపై చులకన చూపు చూసే కేంద్ర ప్రభుత్వంలో ఇరు పార్టీ లు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఎలా ఉంటుందంటే మన సంసారాన్ని నడిరోడ్డున వేసుకున్నట్లే ఉంటుంది.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో ని అధికార, ప్రతిపక్షాల పరిస్థితి ఇలానే తయారైంది.. రెండు పార్టీలు రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో ఒకరిపై ఒకరిని విమర్శించుకుంటూ పలుచన అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన దానిపై కాకుండా వైసీపీ, టీడీపీలు రాష్ట్ర పరువును ఢిల్లీ వీధుల్లో తీసేస్తున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

జగన్ అస్తమానం చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని కేంద్రం ముందు ప్రస్తావించడం తో జగన్ కూడా వారి దృష్టిలో కొంత వీక్ అయిపోతున్నాడట.. రాజధాని భూముల అవినీతి, ఫైబర్ గ్రిడ్ అవినీతి అంశాలను సీబీఐ చేత విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తుండడంతో కేంద్ర పెద్ద మనస్సులో జగన్ కి రాష్ట్రాభివృద్ధి కంటే చంద్రబాబు ను అణిచివేయాలని కోరిక ఎక్కువ ఉందని అనిపిస్తుందట.. ఈ విషయాన్నీ ఒక్కసారి చెబితే కేంద్రం సీబీఐ విచారణ కి అంగీకరిస్తుంది. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం జాతీయ స్థాయిలో టీడీపీ, చంద్రబాబు పరువును తీసేందుకే ప్రయత్నించింది. మళ్ళీ జగన్ కూడా అదే మాటను నొక్కి వక్కాణించడం వారికి మంచి రాజకీయం అనిపించట్లేదట..

మరోవైపు చంద్రబాబు కూడా జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుండి వైసీపీ ప్రభుత్వంపై కేంద్రానికి లేఖలు, ఫోన్ కాల్స్ సంధిస్తూ పాలన లోని లోపాలను బయటపెడుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంకా సెటిల్ అయ్యే అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ఇంటి గుట్టుని బట్టబయలు చేస్తుండడంతో కేంద్రానికి రాష్ట్రం పట్ల ఓ చులక న భావం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తుందని, వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఏపీ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని టీడీపీ ఆరోపిస్తుంది. రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇంకా అనేకాంశంలో టీడీపీ ఆరోపణలు చేసింది.. ఇలా ఒకరినొకరు రాష్ట్రంలో విమర్శించుకుంటే పర్వాలేదు కానీ ఇలా కేంద్రంలో విమర్శించుకుని మన పరువు మనమే తీసుకుంటున్నామా అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -