Saturday, April 20, 2024
- Advertisement -

కేంద్రంపై అవిశ్వాస తీర్మానంలో మ‌రో మ‌లుపు….

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోదా కల్పన, విభజన హామీల అమలులో విఫలమైన ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసులు ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతోందని తాము ముందు నుంచి చెబుతున్నా ఎవరూ నమ్మలేదని… ఇప్పటికైనా వారందరికీ అర్థమవుతుందని భావిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలంతెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతోందని తాము ముందు నుంచి చెబుతున్నా ఎవరూ నమ్మలేదని… ఇప్పటికైనా వారందరికీ అర్థమవుతుందని భావిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు తాము ఓ విన్నపం చేస్తున్నామని… వెల్ లోకి వచ్చి ఆందోళనకు చేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చను అడ్డుకోవద్దని… మాట్లాడే అవకాశం మీకు వచ్చినప్పుడు, మీ సమస్యలను చెప్పుకోవాలని అన్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -