Saturday, April 20, 2024
- Advertisement -

రోజాకి మంత్రి పదవి.. అనిల్ కి డిప్యూటీ సీఎం.. ?

- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన క్యాబినెట్ లో మార్పులపై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమైన నిర్ణయం దీశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై పార్టీలోని సీనియర్ నేతలకు కూడా సమాచారం ఇచ్చారు. త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో రెండు బెర్త్‌లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు చేయబోతున్నారు. వారిద్దరూ రాజీనామా చేస్తే ఎవరికి జగన్ మంత్రి పదవులు అవకాశం కల్పిస్తారని చర్చ ఓ వైపు సాగుతుంటే ఇప్పుడు కీలకమైన అంశం తెరపైకి వచ్చింది.

అదే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీతో ఏర్పడి డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు అని చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎస్సీల నుంచి నారాయణస్వామి డిప్యూటీ మినిస్టర్ గా ఉన్నారు. బిసీల నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్టీల నుంచి పాముల పుష్ప శ్రీవాణి, మైనార్టీల నుండి అంజాద్ బాషా, కాపుల నుంచి ఆళ్ల నాని డిప్యూటీ సీఎంలుగా పనిచేస్తున్నారు. ఈ ఐదుగురు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు. జగన్ వెంట నడిచినవారు. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు పదవులకు డబ్బులకు తలొంగకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడిన వారే. డిప్యూటీ సీఎంలు గా వీరిని నియమించేటప్పుడు జగన్ అర్హతలను పరిశీలించారు. ఇప్పుడు ఈ అయిదుగురిలో ఒకరైన డిప్యూటీ సీఎం అయినా పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వరలో రాజీనామా చేయబోతున్నారు.

ఈయన స్థానంలో మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం ను సీఎం జగన్ నియమించాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఇప్పుడు అదే కసరత్తు చేస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎం ఇవ్వడానికి కారణం అతని విధేయత. వైఎసాఆర్ కి సుభాష్ చంద్రబోస్ శిష్యుడు. వైయస్ మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించగానే నాడు రోశయ్య క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవిని విధేయుడు. అందుకే జగన్ గెలవగానే పిల్లి సుభాష్ చంద్రబోసు ఓడిపోయిన సరే ఎమ్మెల్సీ చేసి ఏకంగా డిప్యూటీ సీఎంనే చేశారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటే మళ్లీ అదే విధేయత కలిగి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారట. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఎం శంకర్నారాయణ, జయ రాములు, అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నారు. ఒకొక్కరు ఒక్కో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి మినహాయిస్తే మిగిలిన ఐదుగురిలో ఎవరో ఏపి డిప్యూటీ సీఎం అవుతారని చర్చ జరుగుతోంది.

వీరిలో జగన్మోహన్ రెడ్డి ఇది అత్యంత విధేయులు మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని పరిశీలిస్తే అనిల్ కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకర్ నారాయణ పేర్లు బలంగా వినిపిస్తాయి. బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి అయినప్పటికీ ఇప్పటికే విజయనగరం జిల్లా నుంచి పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా ఉండటం తో బొత్స సత్యనారాయణకు అవకాశం లేదు. ఇక ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళంలో సీనియర్ లీడర్ అయితే అదే జిల్లాలో స్పికర్ తమ్మినేనికి అత్యుత్తమైన పదవి ఉండటంతో ధర్మాన కృష్ణదాస్ కి కూడా అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. శంకర్ నారాయణ జగన్కు మొదటినుండి విధేయుడు కానీ తొలిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. బలమైన వాయిస్ లేకపోవడం ఆయనకు మైనస్. ఇప్పుడు అన్ని కోణాల్లోనూ నెల్లూరు జిల్లాకు చెందిన యువ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ సీఎం అవుతారన్న ప్రచారం సాగుతోంది. జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనిల్ కుమార్ యాదవ్ ను డిప్యూటీ సీఎం చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేకసార్లు అతని పార్టీ విదేయతను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. అనిల్ విషయంలో ప్రతిపక్షాలకు సైతం రెండు అభిప్రాయం ఉండదు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు అనిల్ విర్చుకుపడుతారు. అంతేకాదు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రి అయ్యారు అనిల్ కుమార్ యాదవ్. అత్యంత కీలకమైన సాగునీటి పారుదల శాఖ ఏడాదిలో సమర్దవంతగా నిర్వహించారు. అనిల్ కుమార్ యాదవ్ బీసీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీసీలో ఉన్న 139 కులలో యాదవుల జనభా అధికం.

దాంతో ఆ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం సమంజసం అని జగన్ భావిస్తున్నారు. అప్పుడు పిల్లి సుభాష చంద్రబోస్ తరహాలోనే ఆయన స్థానని పార్తీకి జగన్ కి అత్యంత నమ్మిన వాళ్లకే ఇచ్చారే మేసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన వారికే ఎంతైన ఇస్తారు అని మరోసారి నిరూపించినట్లు అవుతుందని చెబుతున్నారు. దీనివల్ల అటు బలమైన బీసీ సామాజిక వర్గానికి ఉన్నత స్థానం ఇచ్చినట్లు అవుతుంది. ప్రలోభాలకు లొంగకుండా విధేయులుగా ఉన్నవారికి అగ్ర స్థానం కల్పించినట్లు అవుతుంది. అందుకే జగన్ త్వరలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే మంత్రి అయిన అనిల్.. ఇప్పుడు ఏడాదిలోనే డిప్యూటీ సీఎం అయ్యే అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.

ఇక త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో రెండు బెర్త్‌లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు చేయబోతున్నారు. వారిద్దరూ రాజీనామా చేస్తే ఎవరికి జగన్ మంత్రి పదవులు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అందులో రోజాకి కూడా మంత్రి పదవి ఈ సారి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల సాయం..!

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

దేశం కోసం అండగా ఉంటాం.. ప్రధానితో సీఎం జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -