Friday, March 29, 2024
- Advertisement -

జగన్ కౌంటర్.. బాబు ఎన్ కౌంటర్.. రంజుగా సభ

- Advertisement -

ఏపీ అసెంబ్లీ వేదికగా ఒకటి స్పష్టమైంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తొడగొట్టాడు.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు సై అన్నారు. తొలిరోజే మాటల తూటాలు పేలాయి. జగన్ స్పీకర్ గా తమ్మినేని ఎన్నిక సందర్భంగా చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షానికి గొంతు లేకుండా చేసిన వైనం.. సస్పెన్షన్లు, గొంతు నొక్కడాలతో చేసిన వైనాన్ని ఎత్తి చూపారు.

తొలి ప్రసంగంలోనే చంద్రబాబుపై డెరైక్ట్ గా అటాక్ చేశారు జగన్. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసిన చంద్రబాబుకు.. అదే 23మంది ఎమ్మెల్యేలను దేవుడు మిగిల్చాడని.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఎద్దేవా చేశారు.. స్పీకర్ ను పొగిడే ప్రతీ సందర్భంలోనూ జగన్ చంద్రబాబు గత ప్రభుత్వంలో చేసిన దమనకాండను ఉదాహరణ తీసుకొని ఎద్దేవా చేయడం విశేషం. జగన్ మాటలకు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ.. హర్షధ్వానాలు చేస్తూ ఎంకరేజ్ చేశారు.

ఇక చంద్రబాబు కూడా సై అన్నారు. జగన్ తొలి ప్రసంగంలోనే తనపై, తాను ముఖ్యమంత్రిగా చేసిన చర్యలను ఎండగట్టడాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. తొలి సభ కాబట్టి తాను విమర్శలను పట్టించుకోవడం లేదు. ముందు ముందు చూస్తారని బాబు సవాల్ విసిరారు.. అధికారంలోకి రావడం మీకు కొత్త కావచ్చు కానీ.. ప్రతిపక్షంలో ఉండడం నాకు కొత్త కాదని.. ఇది వరకూ చాలాసార్లు ప్రతిపక్షంలో పనిచేశానని.. మీపై నా పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందంటూ బాబు కూడా బాగానే కౌంటర్ ఇచ్చారు.

ఇలా చంద్రబాబుపై తన యుద్ధం అసెంబ్లీలో ఆగదని తొలిరోజే జగన్ స్పష్టం చేయగా.. ఓడిపోయినా.. ప్రతిపక్షంలో తమ దూకుడు తగ్గదని చంద్రబాబు అంతేధీమాను వ్యక్తం చేశారు. పైగా మాటల తూటాలు పేల్చే అచ్చెన్నాయుడిని చంద్రబాబు పక్కనే ఉంచుకోవడంతో ప్రతిపక్షం కూడా బాగానే అధికారపక్షాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -