Friday, April 19, 2024
- Advertisement -

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.2,24,751.18 కోట్ల అంచనాతో రూపొందించినట్టు తెలిపారు. ఏపీ శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2020-21 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44.396.54 కోట్లుగా పేర్కొన్నారు.

బడ్జెట్‌లో ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం :

  • వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు
  • వ్యవసాయానికి రూ.11,891 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు
  • వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు
  • ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
  • బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
  • వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
  • విద్యశాఖకు రూ.22,604 కోట్లు
  • ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు
  • పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు
  • పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు
  • బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు
  • రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ ఆసరాకు రూ.6,300 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు
  • అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు

కరోనాపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు.. అలానే కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థలో సమ్యసలు రాకుండా చర్యలు పై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపారు.

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

లాక్ డౌన్ పెట్టడం పై.. టెస్టులు పై మంత్రి ఈటెల క్లారిటీ..!

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -