Thursday, April 25, 2024
- Advertisement -

అసెంబ్లీ స‌మావేశాల్లో సీటుపై ర‌చ్చ‌ర‌చ్చ‌…

- Advertisement -

బ‌డ్జెట్‌పై అసెంబ్లీ స‌మావేశాలు హాట్ హాట్‌గా సాగుతుంటే….మ‌రో వైపు స‌భ్యుల‌కు సీట్ల కేటాయింపు వ్వ‌వ‌హారం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది. అచ్చెన్నాయుడు తన స్థానంలో కూర్చొకుండా చంద్రబాబు పక్కన కూర్చొంటున్నారని.. బుచ్చయ్య చౌదరికి కేటాయించిన సీటులో అచ్చెన్నాయుడు కూర్చొంటున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

సీట్ల విషయంలో కూడా నిబంధనలు.. సంప్రదాయాల అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుగ్గన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారని.. మరింత అనుభవం సంపాదించాలని సూచించారు చంద్రబాబు. సీట్ల కేటాయంపు ర‌చ్చ‌పై జోక్యం చేసుకున్న జ‌గ‌న్ బాబుపై విరుచుకు ప‌డ్డారు.

సభకు ఉన్న నియమ నిబంధనలు మారవు.. సభ్యులు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు జగన్. స్పీకర్‌కు చంద్రబాబు రూల్స్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రతి సందర్భంలో టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా రూల్స్ పాటించాల్సిందేనన్నారు. ప్రతిదీ వివాదం చేయడం సరికాదని.. స్పీకర్‌ను అగౌరవపరచడం మంచి పద్దతి కాదన్నారు.

సీట్లెక్కడ ఉండాలి… ఎవరి పక్కన కూర్చోవాలంటూ ప్రతిపక్ష సభ్యులు సమయాన్ని వృథా చేస్తోందంటూ జగన్ మండిపడ్డారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు లావుగా, పొడుగ్గా ఉన్నారనే అన్నాము తప్పించి ఎటువంటి అసభ్యపదజాలాన్ని వినియోగించలేదన్నారు.

చిన్న విషయాన్ని పట్టుకొని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని.. సభ సజావుగా సాగేలా చూడాలని జగన్ స్పీకర్‌ను కోరారు. ప్రశ్నోత్తరాలకు సంబంధించి.. కేవలం రెండు ప్రశ్నలు మాత్రమే పూర్తయ్యాయని.. బడ్జెట్‌పై చర్చ జరగాలని గుర్తు చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -