రాజధానిపై గందరగోలం….జగన్ క్లారిటి ఇస్తారా…?

404
AP Capital Amravati Confused on Change
AP Capital Amravati Confused on Change

జగన్ అమెరికా విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజధానిపై రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ నేతలు రాజధాని తేనె తుట్టెను కదిలించారు. అమరావతి మార్పుపై పాము చావద్దు…కట్టె విరగొద్దు అన్న సామెతలాగా నేతలు వ్యాఖ్యానించారు. వరదలు అటుంచి ఇప్పుడు రాజధాని వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది. దీంతో ఇరు పార్టీలు రాజధానిపై రాజకీయాలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెల్తే…విభజన సమయంలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనెదానిపై కేంద్రం జస్టిస్ శివరామక్రిష్ణ కమిటీని వేసింది. కొన్ని ప్రాంతాలను పరిశీలించిన కమిటి అమరావతి కాకుండా దోణకొండ అయితే రాజధానికి ఉపయేగంగా ఉంటుందని నివేదిక ఇచ్చింది.

నివేదిక ప్రకారం రాజధానికి సరైన ప్లేస్ కాదని తేల్చింది. అది భూకంపాల జోన్, వరదలు కూడా వస్తాయని హెచ్చరించింది. అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం కూడా ప్రమాదకరమని క్లారిటీగా చెప్పేసింది. మరో వైపు పర్యావరణ వేత్తలు కూడా అమరావతి రాజధానికి సేఫ్ ప్లేస్ కాదని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. కాని బాబు మాత్రం వాటన్నింటికి పక్కన పెట్టి అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారు. రాధానిగా అమరావతిని ప్రకటించకముందే టీడీపీ నేతలు బినామీల పేరుతో వందల ఎకరాలు కొన్నారనె విమర్శలు ఉన్నాయి.

ప్రభుతవ్వం మారింది. వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ సీఎం అయ్యారు. మొదటినుంచి రాజధాని ప్రాంతంపై జగన్ కొంత వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవం.ఇక ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా జరిగిందని జగన్ సీఎం గా అయ్యాక కూడా ఆరోపణలు చేశారు. దానికి తోడు జగన్ కు క్రిష్ణమ్మ ఆ అవకాశం ఇచ్చింది. వరదలు పెద్ద ఎత్తున కనీ వినీ ఎరగని రీతిలో ముంచెత్తి అమరావతి రాజధాని ప్రాంతాన్ని ముంచేసిన ఘటనలు యావత్తు ఏపీ ప్రజలు కళ్లారా చూశారు. ఇప్పుడు అదే అంశాన్ని జగన్ వాడుకోనుననారు.

జగన్ నోటి మాటనే మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ మీడియా మీట్లో చెప్పారని భావిస్తున్నారు. బొత్స అన్నది కూడా అదే. వరదల నుంచి అమరావతిని కాపాడాలంటే ప్రత్యేకంగా చెక్ డ్యాములు, డ్రైన్లు కూడా పెద్ద ఎత్తున కట్టాలని, అలాగే ఫ్లై ఓవర్లు కూడా కట్టాలని చెప్పారు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమని బొత్స వ్యాఖ్యలు చేయడంతో రాజధాని రాజకీయం తెరపైకి వచ్చింది.

మొదటినుంచి జగన్ దోనకొండ పై అసక్తితో ఉన్నారు. అక్కడ అయితే రాజధానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న దోనకొండ ఇటు కోస్తాకు, అటు రాయలసీమకు అనువైన ప్రాంతంగా శివరామక్రిష్ణ కమిటీ తేల్చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూములు, అటవీ భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాజధాని నిర్మానానికి కూడా పెద్దగా ఖర్చు ఉండదు. భూకంపాలు, ప్రక్రుతి విపత్తుల సమస్య ఉండదు.

ఇపుడు ప్రక్రుతి ఒక వార్నింగ్ ఇచ్చింది. దాన్ని కాషన్ గా తీసుకుని జగన్ సర్కార్ దోమకొండ వద్ద కొత్త రాజధాని ప్రకటించేందుకు సిధ్ధం కాబోతోంది. దోమకొండ రాజధాని అయితే కేంద్రం సాయం కూడా ఇస్తుంది. ఎక్కువ ఖర్చు కాకుండా రాజధానిని కట్టుకోవచ్చు. అటవీ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. వాటిని డీ నోటిఫై చేయడం ద్వారా పైసా ఖర్చు లేకుండా భూములు కూడా తీసుకోవచ్చు. జగన్ సర్కార్ ఈ పని చేస్తే ఏపీ మీద రాజధాని భారం పూర్తిగా తగ్గిపోతుంది.

లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి అమరావతి రాజధాని నిర్మించడం చంద్రబాబుకు కూడా అసాధ్యమే. భారీ ఎత్తున అప్పులు తెచ్చి క‌ట్టినా కూడా అది సేఫ్ జోన్ కాదన్నది మేధావుల అభిప్రాయం. ప్రస్తుతం జగన్ విదేశీ టూర్ లో ఉన్నారు. జగన్ క్లారిటీ ఇస్తే గాని ఈ గందరగోళానికి పుల్ స్టాప్ పడదు. మరి ఆ పని చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే…?

Loading...