Saturday, April 20, 2024
- Advertisement -

ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఎన్డీఏనే యూట‌ర్న్ తీసుకుంది..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనీ ఏకిపారేశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం స‌మ‌యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాఇవ్వడం సాధ్యం కాదని మోదీ మరోసారి చెప్పారు. ప్రధాని ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

ఢిల్లీని మించిన రాజధానిని ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ… మాట తప్పారని బాబు మండి ప‌డ్డారు. జాతీయ పార్టీతో కలసి ఉంటేనే ఏపీ ప్రయోజనాలను సాధించుకోగలమనే నమ్మకంతో ఎన్నికల సమయంలో బీజేపీతో చేతులు కలిపామని… ఇరు పార్టీలు కలసి ప్రచారాన్ని నిర్వహించామని, కలసికట్టుగా విజయం సాధించామని చెప్పారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు.

ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని… మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

వాజ్ పేయి హయాంలో తమకు 29 మంది ఎంపీలు ఉన్నారని… తాము ఎన్డీయేలో ఉన్నప్పటికీ ఒక్క మంత్రి పదవిని కూడా అడగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. లోక్ సభ స్పీకర్ పదవిని మాత్రమే తీసుకున్నామని… ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసమే ఆ పదవిని తీసుకున్నామని చెప్పారు.

తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చి ఏపీ సమస్యలను పరిష్కరించాలని కోరారని… అయితే రకరకాల కారణాలు చెబుతూ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. చిన్నిచిన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించారని చెప్పారు

తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఏదీ ఆశించకుండానే, పని చేశామని చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నింలోకి ఏపీ వెనుకబడి ఉందని… దీనికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇది ఏపీ ప్రజలు తప్పిదం కాదని, ఆంధ్ర ప్రజలు ఎంతో కష్టపడే తత్వం కలవాలిగిన వారైనప్పటికీ… రాష్ట్రాన్ని విభజించడంతోనే తాము నష్టపోయామని చెప్పారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకీ 80 హామీలు ఇచ్చార‌ని..ఇందులో తొలి హామి ప్ర‌త్యేక హోదా అని చెప్పారు.

తామేదో వివాదాలు సృష్టిస్తున్నట్టు, వాటిని ప్రధాని పరిష్కరిస్తున్నట్టు మోదీ మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధి చేయాల్సి బాధ్యత మీకు లేదా అన్ని నిలదీశారు. బాబు యూటర్న్ తీసుకున్నాడని బీజేపీ నేతలు అంటున్నారు.. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వమే యూ టర్న్ తీసుకుందని సీఎం విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -