Friday, April 26, 2024
- Advertisement -

రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు..

- Advertisement -

విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రానికి రావాల్సిన హ‌క్కుల‌ను నెర‌వేర్చాల‌ని చంద్ర‌బాబు రాష్ట్ర‌ప‌తితో భేటీ అయ్యారు. బాబుతో పాటు ఎంపీ అశోక్‌గజపతిరాజు, పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. చంద్రబాబు ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు, పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా నడిచి వెళ్లారు. 18 డిమాండ్ల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని రాష్ట్ర‌ప‌తికి అందించారు.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని సోమ‌ర‌వారం నాడు బాబు ధ‌ర్మ‌పోరాట దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. దీక్ష‌కు కొన‌సాగింపుగా బాబు బృందం రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన అనంత‌రం…కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల సెంటీ మెంట్‌, మ‌నో భావాల‌ను కేంద్రం ఏమాత్రం ప‌ట్టించుకోండం లేద‌ని మండిప‌డ్డారు. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్లు అమలుచేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీకి నిధులు విడుదల చేయకుండా కేంద్రం కాలక్షేపం చేసిందని ఆయన మండిపడ్డారు.

విభజన హామీలను అమలు చేస్తామని మోడీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హామీలను విస్మరించిందని ఆయన చెప్పారు. ప్రధాని మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోదీకి లేదని అన్నారు.తమ పోరాటానికి కాంగ్రెస్‌ పూర్తి మద్దతు తెలిపిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -