Friday, March 29, 2024
- Advertisement -

ఏపీలో మ‌రో కొత్త రాజ‌కీయం మొద‌లెట్టిన చంద్ర‌బాబు…

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యింది. జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బ‌కు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది. గెలుపు ఆశ‌లు బాబ‌లో స‌న్న‌గిల్లుతున్నాయి. అసెంబ్లీ సీట్లు పెర‌గ‌క‌పోవ‌డం అతి పెద్ద దెబ్బ‌. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను న‌మ్ముకుంటే లాభం లేద‌ని మ‌రో కొత్త రాజ‌కీయానికి తెర‌లేపారు. ఇత‌ర పార్టీల్లో ఉన్న కీల‌క నేత‌ల‌పై దృష్టి సారించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న్మ‌భూమి, శంకుస్థాప‌న‌ల మీద దృష్టి పెట్టిన బాబు సంక్రాంతి త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌నున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి అభ్య‌ర్తుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇత‌ర పార్టీల కీల‌క నేత‌లు టీడీపీలో చేరితే అది లాభిస్తుంద‌ని బాబ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. పేరున్న నాయకులు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైతే… వారిని ఆహ్వానించేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నార‌ట‌. పార్టీలో చేరే నాయ‌కుల ప్రాధాన్య‌త‌ల‌ను బ‌ట్టి వారికి టికెట్లు ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారు.

గ‌తంలో ఇత‌ర పార్టీల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న నేత‌లు, వైసీపీకీ రాజీనాలు చేసిన నేత‌ల‌ను టార్గెట్ చేశారు సీఎం చంద్ర‌బాబు. కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి అహ్మదుల్లా, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ వంటి వాళ్లు త్వరలోనే టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నటుడు కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆల‌స్యం చేస్తే ఆశాభంగం అన్న చందంగా…త్వరగా పార్టీలోకి వస్తే వారికి టికెట్లు ఖరారు ఇచ్చేందుకు బాబు ఆఫ‌ర్ ఇచ్చారంట‌. సాధ్యమైనంత త్వరగా నేతలను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో బాబు ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలునుంచి వ‌స్తున్న స‌మాచారం. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన తరువాత పార్టీలో చేరితే… మళ్లీ నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం కూడా పలువురు నాయకుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతైనా అది బాబు మార్క్ రాజ‌కీయం క‌దా….!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -