Friday, March 29, 2024
- Advertisement -

సోషల్ మీడియా సైన్యాన్ని ప్రయోగించాలని చంద్రబాబు నిర్ణయం

- Advertisement -

ఇంట‌ర్నెట్ సామాన్యునికి అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా సోషియ‌ల్ మీడియా రాజ్య‌మేలుతోంది.దీనికున్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు.దేశంలో ప్ర‌తీ రాజ‌కీయ పార్టీకూడా సోషియ‌ల్‌మీడియానే ఆయుధంగా వాడుత‌న్నారు.న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధానికి అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌నం సోషియ‌ల్‌మీడియానేని చెప్ప‌వ‌చ్చు.ఇదంతా ఎందుక‌నుకుంటున్నారా అక్క‌డికే వ‌స్తున్నా.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో బాగా వెనకబడి ఉందన్న విషయం తెలిసిందే.వైసీపీ సోషియ‌ల్ మీడియా ముందు బాబు వ‌ద్ద ఉన్న మీడియా పోటీని ఇవ్వ‌లేక‌పోతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు బాబు సోషల్ మీడియా సైన్యాన్ని రూపొందిస్తారు.

సోషల్ మీడియా సైన్యం కమాండర్ బాధ్యతను అర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి అప్పగించారు. ప్రతి సోమవారం ఆర్థిక మంత్రి నిర్వహించే సంక్షేమ శాఖల సమీక్షా సమావేశాలలో సోషల్ మీడియా టీం కూడా పాల్గొంటుంది. సోషల్ మీడియా సలహాదారు సోహైల్ తప్పనిసరిగా ఈ సమావేశాలలో పాల్గొంటారు.

సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ది పైచేయి కావడంతో, వచ్చే రెండేళ్లో ప్రభుత్వ ప్రచారానికి సోషల్ మీడియాను ప్రధానంగా వాడాలని నిర్ణయించారు. ప్రతిపక్ష దాడిని తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాలోచొరబడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారని తెలిసింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను తిప్పికొట్టేందుకు సోషల్‌ మీడియా విభాగాన్ని మరిరత బలోపేతం చేసేరదుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇక నుంచి ప్రతిసోమవారం యనమల 12 విభాగాల సంక్షేమ పథకాల అమలు తీరు ను సమీక్షిస్తారు. ఈవిభాగంతో పాటు సోషియ‌ల‌మీడియా విభాగాల ప్ర‌తినిధులు పాల్గొంటారు.ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోషల్‌ మీడియా ప్రతినిధి సొహైల్‌లు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -