Saturday, April 20, 2024
- Advertisement -

కనీసం లక్ష బెడ్లు సిద్దం చేయమని చెప్పిన సీఎం జగన్..!

- Advertisement -

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని, అందులో 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి ఏర్పాట్లు చేసుకోవాలని, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారే కాకుండా, విదేశాల్లో ఉన్నవారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని సీఎం అన్నారు.

500 ఆర్టీసీ బస్సులను నిత్యావసర రవాణా వాహనాలుగా మార్చాలని, మొబైల్ యూనిట్లలో మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించారు. కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆమె ప్రాణాలు విడిచారు. ఇందుకు సంబంధించిన వార్త సీఎం జగన్ వద్దకు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. సీఎంవో అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… విపత్తు సమయంలో కూడా కష్టపడుతున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనురాధ కుటుంబానికి వెంటనే పరిహారం అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -