Friday, April 19, 2024
- Advertisement -

జగన్ ఒక్క మాట.. చంద్రబాబు చేతికి అస్త్రం..

- Advertisement -

ఏపీ అసెంబ్లీలో గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టులపై చర్చలో సీఎం జగన్ చేసిన ఒక్క కామెంట్ సభలో తీవ్ర దుమారం రేపింది. ‘కేసీఆర్ మంచోడు’ అని జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన వైనంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పోడియం చుట్టుముట్టి సభ జరగకుండా నినాదాలతో హోరెత్తించారు.

ఏపీ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు జగన్. కిందనున్న ఏపీకి నీళ్లు రావాలంటే తెలంగాణతో సఖ్యతే మేలు అని ఖరాఖండీగా చెప్పారు. వివాదాలకు పోతే వాళ్లు ప్రాజెక్టులు కట్టుకొని మనకు నీళ్లు ఇవ్వరని.. సాన్నిహిత్యంతోనే పనులు సాగించుకోవాలన్నారు. ’తెలంగాణ సీఎం కేసీఆర్ మంచోడని..’ ఆయన మనకు సహకరిస్తున్నారని ప్రాజెక్టుల్లో నీరు వచ్చేవిధంగా ప్లాన్లు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే కృష్ణా నదిలో చుక్కనీరు లేదని. ఆల్మట్టి డ్యాంను మరో పది అడుగులు పెంచారని.. దీనివల్ల కిందకు రావడం లేదని జగన్ అన్నారు.ఇక గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కట్టిందని.. ఏపీకి నీళ్లు రావాలంటే ఒక్క శబరి నది మాత్రమే దిక్కు అని అన్నారు. అందులో కేవలం 400 టీఎంసీలు మాత్రమే ఉంటాయన్నారు. అందుకే పైనున్న తెలంగాణతో సఖ్యత తో ఉంటూ నీటిని వాడుకుంటామని జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘కేసీఆర్ మంచోడని.. సహకరిస్తున్నాడని’ జగన్ అన్నారు. దీనికి టీడీపీ నేతలు అభ్యంతరం తెలిసి సభలో జగన్ మాటలను అడ్డుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రచ్చ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -