Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ కేసీఆర్ ప్లాన్ బి.. కలిసి చేసే పని ఇదే..

- Advertisement -

కేసీఆర్, జగన్ ల భేటి. రెండు రాష్ట్రాల సీఎంల భేటీనే కాదు.. రెండు బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతల భేటి. ఇద్దరూ ఏదో చర్చించుకున్నారు. అది బయటకు రాదు. అయితే ఉమ్మడి శత్రువైన బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదగనీయకుండా.. ఎదుర్కోవడంపైనే జగన్, కేసీఆర్ చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి..

తెలంగాణ, ఏపీలో ఇప్పుడు ఒకటే పరిస్థితి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ ప్రతిపక్షాలుగా దెబ్బతిన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలను తుత్తునియలు చేసి ప్రతిపక్షంగా బలపడాలని ఇప్పటికే బీజేపీ స్కెచ్ గీసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని ఎదగనీయకుండా నిలువరించాలంటే కలిసి నడిస్తేనే కలదు సుఖమనే చర్చ కేసీఆర్, జగన్ ల మధ్య సాగినట్టు సమాచారం.

బీజేపీ ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలపై ఐటీ, ఈడీ దాడులతో నేతలను లొంగదీసుకొని ప్రభుత్వాలను అస్తిర పరిచే పక్షంలో దక్షిణాది రాష్ట్రాలతో కూటమి కట్టి సౌత్ ఇండియా సమైక్యంగా ఉండేలా కేంద్రంతో పోరాడాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయినట్టు సమాచారం.

కర్ణాటకలో బీజేపీప్రభుత్వం ఉంది. అయితే మాజీ సీఎం కుమారస్వామిని, కేరళ సీఎం, తమిళనాడు స్టాలిన్, ఏపీ జగన్, తెలంగాణ కేసీఆర్ లు ఒక జట్టుగా ఉండి కేంద్ర ఆదిపత్య పోకడలను ఎదురించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఎప్పుడైతే కేంద్రం రాష్ట్రాలపై ఆదిపత్యానికి ప్రయత్నిస్తుందో అప్పుడే ఈ ప్లాన్ బయటకు తీయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -