Friday, April 19, 2024
- Advertisement -

జగన్ న్యూ ప్లాన్.. టీడీపీకి ఎన్టీఆర్ పేరుతో చెక్..!

- Advertisement -

స్వపరిపాలన ప్రజలకు చేరువ చేసే జగన్ అధికార వికేంద్రీకరణపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల సమయంలోనే జగన్ అధికారంలోకి వస్తే జిల్లాల విభజన చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీని అమలు కావాల్సి ఉంది. లోక్ సభ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున తొమ్మిది జిల్లాలను 25 జిల్లాలు చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాల విభజన పై సీఎం జగన్ దృష్టి పెట్టారు.

ఈ జిల్లాల విభజనతో రాజకీయాంగాను లబ్ధి పొందేందుకు జగన్ చూస్తున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణాజిల్లా విభజన. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ పేరు మీద ఎలా పెడతారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో అప్పట్లోనే టీడీపీకి షాక్ తగిలింది. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా విభజన చేయనున్నారు. అయితే ఈ జిల్లా విభజనపై కొంత ఉత్కంఠ ఏర్పడింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజించనున్నారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు ఏ జిల్లాకు వెళ్తుందో తెలియదు. ఏ ప్రాంతంలో నిమ్మకూరు వెళ్తుందో ఆ ప్రాంతానికే ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయనున్నారు.

గణతంత్ర దినోత్సవం లోపు జిల్లాల విభజన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విభజించే రెండు జిల్లాల్లో నిమ్మకూరు ఉండే ప్రాంతంలోని ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టనున్నారు. ఇందులో భాగంగా మరో జిల్లా విశాఖపట్నం రెండుగా మారితే.. ఆరకు ప్రాంతం నుండే జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టనున్నారని సమాచారం. ఈ విధంగా స్థానిక పరిస్థితులను రాజకీయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాల విభజన వాటికి పేర్లు పెట్టే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

రోజాకి మంత్రి పదవి.. అనిల్ కి డిప్యూటీ సీఎం.. ?

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

బాబూ క‌ప‌ట రాజ‌కీయాల‌కు కాలం చెల్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -