Thursday, March 28, 2024
- Advertisement -

వేదిక‌మీద అచ్చం రాజ‌న్న‌ను త‌ల‌పించిన‌ జ‌గ‌న్‌… చేతి వాచ్ ఎవ‌రిదంటె…?

- Advertisement -

నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్య అథిధులు అభిమానులు, కుటుంబ స‌భ్యులు, ప్ర‌జ‌ల మ‌ధ్య సాదా సీదాగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి పదకొండు గంటల యాబై నాలుగు నిమిషాలకు తాడేపల్లిలోని తన ఇంటి నుండి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు బయలు దేరారు. సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు వేదికకు చేరుకున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేత పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

వేదిక‌మీద జ‌గ‌న్ ఆవ‌భావాలు అన్ని రాజ‌న్న‌ను త‌ల‌పించాయి. వైయస్ అంటూ ఆయన నోటి వెంట వచ్చి ప్రతిధ్వని 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రమాణ స్వీకారాన్ని గుర్తుకు తెచ్చింది. ఎప్పుడూ కూడా చేతికి వాచ్ పెట్ట‌ని జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి మాత్రం వాచ్ పెట్ట‌డంతో ఇప్పుడు అది హాట్ టాఫిక్‌గా మారింది.

ఇంతకీ ఆ వాచీ ఎవరిదన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర సమాధానం వస్తుంది. ఆ వాచీ దివంగత మహానేత.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టుకునే వాచీని తొలిసారి జగన్.. పెట్టుకున్నారు. తండ్రి వాచీని పెట్టుకొని ప్రమాణస్వీకారోత్సవానికి రావటం విశేషంగా చెప్పాలి. ఇది సోష‌ల్ మీడియాలో ఈ చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఈ వాచ్ వెనక ఉన్న అసలు కారణం ఎంటో జగన్ కే తెలియాలి అని మరికొంతమంది కామెంట్లు చేస్తోన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -