Friday, April 19, 2024
- Advertisement -

ఎంపీల దూకుడుకు జగన్ అడ్డుకట్ట

- Advertisement -

వైసీపీ ఎంపీలు ఇటీవల కేంద్ర మంత్రులను వ్యక్తిగత కలవడం.. వివిధ జాతీయ, రాష్ట్రీయ చానెల్స్ లో డిబేట్ లో పాల్గొనడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఇలా కీలకమైన చర్యలను వైసీపీ అధిష్టానానికి చెప్పి చేయాలని జగన్ సూచించినట్టు తెలిసింది.

కేంద్రంలో మోడీ, అమిత్ షా సహా ఏ కేంద్రమంత్రిని వైసీపీ ఎంపీలు వ్యక్తిగతంగా కలవడానికి వీల్లేదని.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డికి సమాచారం ఇచ్చాకే అందరూ ఉమ్మడిగా వెళ్లి కలువాలని జగన్ సూచించినట్టు తెలిసింది.

ఇక చాలా జాతీయ, రాష్ట్ర న్యూస్ చానెల్స్ లో ఎంపీలు, ఇతర నేతలు ఇష్టానుసారంగా తమ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతూ వైసీపీకి తలవంపులు తెస్తున్నారని.. ఇక నుంచి ఎవ్వరూ పార్టీ స్టాండ్ తెలుసుకున్నాకే డిబేట్లలో పాల్గొనాలని జగన్ హెచ్చరించినట్లు తెలిసింది.

వైసీపీ ఎంపీలు కేంద్రంలోని పెద్దలను కలిసినా, వివిధ న్యూస్ చానెల్స్ లో మాట్లాడినా కేవలం వ్యక్తిగత ఎజెండాలను చెబుతున్నారని వైసీపీ అధిష్టానం గుర్తించింది. ఈ పరిణామం పార్టీకి డ్యామేజ్ తెస్తోందట.. అందుకే జగన్ ఇలా చేయకూడదని తాజాగా హెచ్చరికలు పంపారు.

ఇలా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎంపీలు, ఇతర నేతలకు జగన్ మార్క్ హెచ్చరిక వెళ్లింది. దీంతో ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు మారి కూటమిగా వెళుతారా? లేదా అన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -