Tuesday, April 23, 2024
- Advertisement -

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!

- Advertisement -

జగన్ సర్కార్ ఎవరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. గ్రామ-వార్డు సచివాలయాల్లో వర్క్ చేస్తున్న మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రస్తుతం రెండేళ్ళ ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు. దాంతో వారు కూడా సెలవులు కావాలని ప్రభుత్వంను అడిగారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది.

వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వార్డు సచివాలయాలను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసింది. వీటితో పాటు ఉద్యోగులకు 15 వేల వేతనం ఇస్తున్నారు. ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వీరికి సాధారణ ఉద్యోగుల తరహాలో జీత భత్యాలు సెలవులు వర్తిస్తాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు…

మీ విధానాలు అన్ని రాష్ట్రాలకి ఆదర్శం.. జగన్ పై మోడీ ప్రశంసలు..!

ఢిల్లీకి వెళ్లకముందే.. మోడీ నుంచి జగన్ కు గుడ్ న్యూస్..!

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ… రూ.96,550 కోట్లు ఖర్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -