108 సిబ్బందికి జీతాలను భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం..!

518
Ap Govt Increased Salary for 108 Staff
Ap Govt Increased Salary for 108 Staff

ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనే విధంగా ముందుకు వెళ్తుంది ఏపీ అధికారిక పార్టీ వైసీపీ. అందుకే ఇప్పుడు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కుయ్.. కుయ్.. అనే శబ్దం వినగానే మనకు వెంటనే అర్దం అయ్యేది.. ఎవరో అనారోగ్యంగా ఉన్నారని. వారిని కాపాడేందుకు అంబులెన్స్ వచ్చిందని. అలాంటి ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి సీఎం జగన్ జగన్ శుభవార్త అందించారు.

ప్రస్తుతం డ్రైవర్ల జీతం రూ. 10 వేల నుంచి సర్వీసును బట్టి రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను ప్రస్తుత రూ.12 వేల నుంచి సర్వీసును బట్టి రూ.20 నుంచి రూ 30 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈరోజు గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో కేన్సర్ బ్లాక్ ను జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 108 సిబ్బంది జీతాలను పెంచబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. విజయవాడలో 1,088 వాహనాలను (108, 104) ఈరోజు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సీఎం చేసిన ప్రకటనతో 108 సిబ్బంది గొప్ప సీఎం మీరు అంటూ జగన్ పై ప్రశంసలు కూరిపిస్తున్నారు.

1,088 అంబులెన్స్‌లను ప్రారంభంచిన జగన్ సర్కార్..!

జులై 31 వ‌ర‌కు లాక్‌ డౌన్‌.. తెలంగాణ సర్కారు జీవో..!

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్

ఏపీ సీఎం జగన్ చూసి మేము నేర్చుకోవాలి : ఆమ్రపాలి

Loading...