Thursday, March 28, 2024
- Advertisement -

ఆగస్టు 16న రాజధాని శంకుస్థాపన ?

- Advertisement -

మూడు రాజధానుల అంశంను జగన్ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనతం త్వరగా పరిపాల విభాగాన్ని విశాఖకు తరలించాలని గట్టిగా పట్టుపట్టింది. దీన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు కూడా పెచ్చారు. విమర్శలు జోరు ఎక్కువగా ఉన్నప్పటికి ఆయన మాత్రం అసలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సీఆర్డీయే రద్దు బిల్లుకు ఇటీవల ఆమోదముద్ర వేయగా.. దీనిపై ఆగస్టు 14 వరకు హైకోర్టు స్టేటస్ కో విధించింది.

దాంతో తరలింపు పక్రియ ఆగింది. దాంతో ఆలస్యం అనోసరమని భావించిన జగన్ సర్కార్.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రభుత్వం తరుపున దాఖలు చేశారు. దాంతో దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. మూడు రాజధానుల ప్రకటించిన తర్వాత ప్రభుత్వంపై అమరావతి ప్రాంత రైతుల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. సీఆర్డీయే, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మండలిలో అడ్డుకున్నారు. అయినప్పటికి గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు కేసు వేయడంతో ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.

ఇలా అయితే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభం ఆలస్యం అవుతుందని భావించిన జగన్ సర్కార్ సుంప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఇది వారాంతం కాబట్టి ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణకు వస్తుందని భావిస్తోంది ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం తరలింపు ప్రక్రియను మాత్రం ముందుకు కొనసాగిస్తున్నారు. విశాఖలో ఆగస్టు 16న రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేయాలనే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అందుకే ఈ అంశంను వీలైనంత త్వరగా తేల్చాలని సుప్రీంకు వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

చంద్రబాబు ఓ చక్రవర్తిలా కలగన్నాడు..!

జిల్లాల విభజన.. ఎవరూ ఊహించిన సర్ ఫ్రైజ్ ఇవ్వనున్న సీఎం జగన్..!

శుక్రవారం.. శుక్రవారం.. బాధపెట్టిన టీడీపీకి అదే శుక్రవారం జలక్ ఇచ్చిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -