Wednesday, April 24, 2024
- Advertisement -

ఆదినారాయణ రెడ్డికి హైకోర్ట్ షాక్.. జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్..!

- Advertisement -

కడప జిల్లాలో ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉంటూ అతని వద్ద టీడీపీ పంచన చేరిన జమ్మలమడుగు నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి జగన్ ప్రభుత్వం తాజాగా షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలో ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

మాజీ మంత్రిగా కడప జిల్లాలో అధికార వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని తనకు భద్రత కొనసాగించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఆదినారాయణ రెడ్డికి భద్రత కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో గత ఏడాది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖుల భద్రత సమీక్షించి చేసిన మార్పుల్లో భాగంగానే ఆదినారాయణ రెడ్డికి భద్రత తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుత ప్రజాప్రతినిధిగా కూడా లేని ఆదినారాయణ రెడ్డికి భద్రత అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు తెలిపింది.

ఈ వాదనతో ఏకీభవించిన హై కోర్ట్ ఆదినారాయణరెడ్డికి భద్రత తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. ఆదినారాయణ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి అధికార పార్టీలో ఫిరాయించినా ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైన జగన్తో పాటు వైసీపీ నేతలని ఎదిరించి నిలిచారు. చివరకు వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ప్రభుత్వం ఆయనను విచారించింది. వైసీపీ ప్రభుత్వం రాగానే బీజేపీ లోకి వెళ్లిపోయారు ఆదినారాయణ రెడ్డి.

చంద్రబాబు ఓ చక్రవర్తిలా కలగన్నాడు..!

జిల్లాల విభజన.. ఎవరూ ఊహించిన సర్ ఫ్రైజ్ ఇవ్వనున్న సీఎం జగన్..!

జగన్ కొత్త సూత్రానికి ఫిదా అయిన మోడీ.. ?

శుక్రవారం.. శుక్రవారం.. బాధపెట్టిన టీడీపీకి అదే శుక్రవారం జలక్ ఇచ్చిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -