Saturday, April 20, 2024
- Advertisement -

హైదరాబాద్ ఎందుకెళ్లారు…? ప్రకాశం బ్యారేజీపై కుర్చీ వేసుకుని కూర్చొవచ్చుగా..?

- Advertisement -

కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.. అయితే, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర డ్రోన్ కెమెరాల వినియోగంపై పాలక, ప్రతిపక్షల మధ్య వరద రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. వైసీపీ ప్రభుత్వంపై అర్థం, పర్థం లేని విమర్శలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు టీడీపీ నేతలు.

చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. వరదల పరిస్థితిని తెలుసుకోవడం కోసమే డ్రోన్‌ను వినియోగించారని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లను వినియోగించారని వివరించారు.

అసలు చంద్రబాబు ఇల్లు ఉంటే ఏంటీ..? పోతే ఏంటీ..? అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగినా.. గాల్లో ఎగిరినా మాకేం పట్టదన్నారు. చంద్రబాబు ఇల్లు ప్రస్తుతం పాడుబడిన బంగ్లా.. దయ్యాల కొంప అని.. రాత్రి 7 కాగానే చంద్రబాబు ఇంట్లో లైట్లు ఆర్పేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా పర్యటనకు వెళ్లే ముందు కూడా సీఎం జగన్ వరదపై సమీక్ష చేశారని తెలిపారు . ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి మా మంత్రి అనిల్ కుమార్ చాలని కౌంటర్ ఇచ్చారు. రివ్యూ చేయాలంటే టీడీపీ సన్నాసులను పిలిచి ప్రకాశం బ్యారెజ్ మీద చర్చించాలా..? అంటూ మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -