Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

- Advertisement -

రాజ్యసభ ఎన్నికలు ఏపీ అసెంబ్లీలో ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం 175 ఓట్లకు గాను 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సీఎం జగన్ తోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇక హోం క్వారంటైన్ లో ఉన్న కారణంగా తాను ఓటింగ్ కు దూరంగా ఉన్నానని చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే వైసీపీ ఒక్కో అభ్యర్థి రాజ్య సభ స్థానానికి 34 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలని నిర్ధేశించింది. ఇక టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి మద్దతు తెలుపుతున్న వల్లభనేని వంశీ మద్దాల గిరిలు కూడా అసెంబ్లీకి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వైసీపీ అభ్యర్దుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్‌ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్‌ బూత్‌లో కూర్చున్నారు. ఎన్నికల బరిలో అధికార పార్టీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు బరిలో ఉన్నారు. ఇక సభలో సఖ్యా బలం లేకపోయినప్పటికి టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు.

అయితే రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నాలుగు చెల్లని ఓట్లు వేశారు. మరి ఇది టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు చేశారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా గెలిచిందని తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, & పరిమల్ సత్వాని విజయం సాధించినట్లు సమాచారం.

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్‌

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -