Wednesday, April 17, 2024
- Advertisement -

ఈ మంత్రుల‌కు ఓటమి భయం పట్టుకుందా..?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీ వ‌లె జ‌రిగ‌ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని వైసీపీ, టీడీపీ ధీమాతో ఉన్నాయి. అయితే స‌ర్వేఫ‌లితాలు వైసీపీకే అనుకూలంగా ఉండ‌టంతో టీడీపీలో ఇప్పుడు అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యింది. పార్టీ ఓడిపోయినా ప‌ప‌ర్వాలేదు గాని ప‌ది మందికి పైగా మంత్రులు ఓడిపోతార‌నె సంకేతాలు అధినేత‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ మీద విరుచుకు ప‌డే నేతలంద‌రూ ఇప్పుడు సైలెంట్ మూడ్ లోకి వెల్లిపోయారు.

ఓడి పోయె మంత్రుల‌లో ప్ర‌ధానం ఇరిగేష‌న్ శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. ఈ ఐదు సంవ‌త్స‌రాల్లో దేవినేని ఉమమ‌హేశ్వ‌ర‌రావు సంపాదించినంతగా మ‌రో వ్య‌క్తి సంపాదించ‌లేద‌ని సొంత నియోజిక వ‌ర్గ ప్ర‌జ‌లే చ‌ర్చించుకుంటున్నారు. త‌న అభివృద్ది త‌ప్ప‌ సొంత నియోజ‌క వ‌ర్గ అభివృద్ధిపై దృష్టి పెట్ట‌లేద‌నె విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. మ‌రో వైపు ఈ నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ త‌రుపున నిచిలిచి అభ్య‌ర్ధి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ బ‌ల‌మైన అభ్యర్ధి కావ‌డంతో దేవినేనికి ఈసారి ఓట‌మి త‌ప్ప‌ద‌నె సంకేతాలు క్షేత్ర‌స్థాయిలో వినిపిస్తున్నాయి.

మ‌రో మంత్ని నారాలోకేష్‌. మంగ‌ళ గిరినుంచి వైసీపీ అభ్య‌ర్ధి ఆళ్ల‌పై సీఎం చ‌ద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేష్ పోటీచేస్తున్నారు. లోకేష్ గెలుపుపై బాబు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. లోకేష్ ఓడిపోతె అది రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని బాబు ప్ర‌తీష్టాత్మ‌యంగా తీసుకున్నారు. ఇక్క‌డ లోకేష్ ఓడిపోతార‌నె సంకేతాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అభ్య‌ర్ధి ఆళ్లకు స్థానికంగా ప్ర‌జ‌ల్లో మంచి పేరు ఉండ‌టంతోపాటు ప‌ది రూపాయ‌ల‌కే అన్ని కూర‌గాయాలు ప్ర‌జ‌ల‌కుం అందించ‌డం, ఐదు రూపాల‌య‌కే రాజ‌న్న క్యాంటీన్‌ల‌ను ఏర్పాటు చేసి నిత్యం ప్ర‌జ‌ల‌మ‌ధ్య‌నే ఉండ‌టం లాంటి అంశాలు గెలుపును సూచిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు కూడా ఓడిపోయె మంత్రుల లిస్ట్‌లో ఉన్నాడు. ప్ర‌తి విష‌యానికి జ‌గ‌న్‌మీద విరుచుకు ప‌డే అచ్చెన్న పోలింగ్ త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. ఇక మ‌రో మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఈ మంత్రిగారి మీద వ‌చ్చిన అవినీతి ఆరోప‌న‌ల‌కు లెక్క‌లేదు. వంద‌ల ఎకరాలు క‌బ్జాచేశార‌నె ఆరోప‌న‌లు ఉన్నాయి. ఈ వ‌రుస‌లోఅయ్య‌న్న పాత్రుడు, సుజ‌యకృష్ణా రంగ‌రావు, గ‌ల్లా జ‌య‌దేవ్‌,చిన్న రాజ‌ప్ప‌,సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి,కాల్వ శ్రీనివాసులు,అఖిల ప్రియ‌,ఆదినార‌య‌ణ రెడ్డి, మొద‌ల‌గు నేత‌లు ఉన్నారు. ఇప్పుడే ఇదే పార్టీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -