Friday, April 19, 2024
- Advertisement -

బీసీల కోసం 52 కార్పొరేషన్లు.. జగన్ వరాల జల్లు..!

- Advertisement -

ఏపీ సీఎంగా భాద్యతలు స్వీకరించిన జగన్.. ఆ రోజు నుంచి ప్రజలకు న్యాయం చేసే దిశగా వెళ్తూ ఆ నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన కులాల (బీసీ) కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల పోస్టులను ఈ నెలాఖరు కల్లా భర్తీ చేయాలనీ అధికాలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంతో పాటు.. 12 మంది డైరెక్టర్లని కూడా నియమించబోతున్నట్టు తెలిపారు.

అందులో కులాల అభివృద్ది కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అనేదాన్ని ఈ కార్పొరేషన్లు పర్యవేక్షించాలని.. అంతేకాకుండా అందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 21240810 మంది బీసీలకు రూ.22685.74 కోట్ల నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం తెలిపారు. 5 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలను వైఎస్ఆర్ చేయూత అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 25 లక్షల మంది మహిళలు పథకాలతో లబ్ది పొందారని గుర్తుచేశారు. వీరిలో అత్యధికులు బీసీ మహిళలే అని తెలిపారు. గతంలో బీసీల కోసం ఇంత పక్కాగా ఎవరు వర్క్ చేయలేదని.. ఒక్క రూపాయి లంచం వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు.

అలానే కొత్త వాటితో కలిపి బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఇప్పుడు మొత్తం 139 కులాలు చేర్చామని అధికారులు తెలిపారు. 10 లక్షలకు పైగల జనాభా ఉన్న కార్పొరేషన్లు 6లక్షకు పైగల కార్పొరేషన్లు 27 లక్షలోపు జనాభా గల కార్పొరేషన్లు 19 ఏర్పాటు చేశామ తెలియజేశారు. దీంతో కార్పొరేషన్ల సంఖ్య 52కి చేరింది. 30 నుంచి 35 వేల జనాభా ఉన్న ప్రతి కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ప్రతి కులాన్ని ఏదో ఒక కార్పొరేషన్లో చేర్చామని తెలియజేశారు.

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

నిమ్మగడ్డ విషయంలో ఊహించని ప్లాన్ వేసిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -