Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీ ఆర్టీసీ విషయంలో జగన్ సంచలన నిర్ణయం..!!

- Advertisement -

కరోనా కారణంగా దేశంలో రవాణా వ్యవస్థ ఎంతగా స్థంభించిపోయిందో అందరికి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా రవాణా వ్యవస్థ ప్రారంభమైనా అది పూర్తి గా మొదలు కాలేదు.. ఆంక్షలతో కూడిన రవాణా చేస్తూ కొంత వరకు ప్రజల ఇబ్బందులు తీర్చే సదుపాయం కల్పించారు ఇక తాజాగా ఈ విషయంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌పై ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లోని అన్ని సీట్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు స‌గం సీట్ల‌లో మాత్ర‌మే ప్రయాణికులను ఎక్కించుకొని తిప్పుతున్నారు. తాజాగా పూర్తిసామ‌ర్థ్యంలో సీట్ల‌లోకి ప్ర‌యాణికుల‌ను అనుమ‌తినివ్వాల‌ని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్నిడిపోల‌కు స‌మాచారం అందించారు.

లాక్‌డౌన్ త‌ర్వాత మే 21 నుంచి బ‌స్సులను న‌డిపిస్తోంది ఆర్టీసీ. అయితే క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను దృష్టిలో పెట్టుకొని స‌గం సీట్ల‌లోనే ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి ఇస్తోంది. =ఆన్‌లైన్‌లోనూ సగం సీట్లే క‌నిపించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. అయితే ఆక్యుపెన్సీ ప‌డిపోవ‌డంతో తీవ్ర‌మైన న‌ష్టాల‌ను సంస్థ ఎదుర్కుంటోంది. దీంతో తాజాగా పాత ప‌ద్ద‌తిని పున‌రుద్ధ‌రించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -