బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య స్పందన..!

1110
Balakrishna reacted on brahmini political entry
Balakrishna reacted on brahmini political entry

గత కొంతకాలంగా రాజకీయాల్లోకి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి వస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు.. మాజీ మంత్రి నారా లోకేష్ భార్య అయిన బ్రాహ్మణి రాజకీయాల్లోకి ప్రవేశించడం దాదాపు ఓకే అయిందని గత ఎన్నికల టైంలో అనుకున్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమంటూ బ్రాహ్మణి గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు.

అయితే ఎన్నికలల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ కేడర్ ని ఉత్సహపరుస్తూ వచ్చేది. 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ విఫలం అయింది. దీంతో నారా బ్రాహ్మణి లాంటి యువ నాయకురాలు.. చదువుకున్న వారు పార్టీకి అవసరమని టీడీపీ కార్యకర్తలు భావించారు. అప్పటి నుండి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా బాలయ్య బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఓకే ఇంటర్వ్యూలో స్పందించారు. బాలయ్య మాట్లాడుతూ..”రాజకీయాలంటే బ్రాహ్మణికి ఇష్టం ఉండదు. వాటి గురించి మాట్లాడటం ఆమెకి నచ్చదు.

బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తుందని అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఆమె రాదు. కాకపోతే పరిస్థితుల బట్టి తను నిర్ణయం తీసుకుంటుందేమో చెప్పలేం. ప్రస్తుతానికి అయితే ఆమెకి ఇష్టం లేదు. అందుకే తన ముందు పాలిటిక్స్ గురించి మాట్లాడను” అని బాలయ్య చెప్పారు. అంతేకాకుండా పెద్దల్లుడు లోకేష్ చిన్నల్లుడు భరత్ ఎప్పటికప్పుడు తమ ఇంటికి వస్తుంటారని.. వీకెండ్స్ లో తామంతా కలుస్తామని.. అయితే రాజకీయాల గురించి మాత్రం పెద్దగా మాట్లాడుకోమని.. రాజకీయంగా ఏదైనా చెప్పాలనుకుంటే చెబుతారు తప్ప దానిపై పెద్దగా చర్చలు ఉండవి బాలయ్య చెప్పుకొచ్చారు.

నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించిన బాలయ్య..!

పవన్ కళ్యాణ్ నుంచి ఈ సారి మామిడి పండ్లు రాలేదు : ఆలీ

బండా బూతులు తిడితున్నారు.. మీ సంస్కారానికి ఓ దండం : చిన్మయి

పెళ్లి రోజు భయపడి పారిపోవాలనుకున్నా : మంచు లక్ష్మీ

Loading...