Friday, March 29, 2024
- Advertisement -

జగన్ ను హెచ్చరిస్తున్న తెలంగాణ ఎంపీ.. ఎందుకంటే..?

- Advertisement -

ప్రసిద్ధ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం అయిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రసిద్ధ ఆలయం లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 దశాబ్దాల కిందట టేకు కలపతో చేసిన ఈ రథాన్ని స్వామివారి కళ్యాణ ఉత్సవాలలో భాగంగా రథోత్సవంలో వినియోగించేవారు. ప్రమాదవశాత్తూ రథం మంటలు అంటుకుని దగ్ధమైందా.. లేక ఎవరైనా దహనం చేశారా అనే దానిపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏపి సర్కార్ పై ధ్వజమెత్తింది.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించింది. కాగా, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది.. అంతర్వేది ఆలయ ఈవో పై బదిలీ వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసామని…అంతర్వేదిలో సిసి కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సైతం సస్పెండ్ చేశామని అన్నారు. ఇదిలా ఉంటే..అంతర్వేది రథం దగ్ధం విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.

కొడాలి నాని భక్తులు విచారంలో ఉంటే ఓ చెక్క కాలిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేయకుండా మౌనం వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అన్ని వర్గాలను సమదృష్టితో చూడాల్సిన పాలకులు ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు . అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాల్లో రాజకీయ నేతలు తలదూర్చడం సబబు కాదని సంజయ్ హితవు పలికారు.

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ… 

కొడాలి నాని తిరుమల విషయంలో నోరు జారారా….?

మీ విధానాలు అన్ని రాష్ట్రాలకి ఆదర్శం.. జగన్ పై మోడీ ప్రశంసలు..!

 శ్రీ‌వారి స‌న్నిధిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -