Saturday, April 20, 2024
- Advertisement -

టిడిపి ఆయువుపట్టుపై సంచలన దెబ్బకొట్టనున్న జగన్

- Advertisement -

టిడిపి ఆయువుపట్టుపై సంచనల దెబ్బ కొట్టడానికి జగన్ వ్యూహం రచించాడా? ఇప్పటికే పదిశాతం మార్జిన్‌తో జగన్ ఘన విజయం సాధించడం ఖాయం అని అన్ని సర్వేలూ తేల్చేస్తున్న నేపథ్యంలో ఈ మాస్టర్ స్ట్రోక్‌తో చంద్రబాబు పూర్తిగా డీలా పడిపోవడం ఖాయమేనా? చరిత్రలోనే కనీవిని ఎరుగని ఘోర పరాజయం టిడిపికి తప్పదా? ఇప్పుడు ఈ స్థాయి విశ్లేషణలే రాజకీయ నాయకులు, జర్నలిస్టుల మధ్య చోటు చేసుకుంటున్నాయి. పార్టీ పుట్టినప్పటి నుంచీ కూడా బిసీలే టిడిపి బలం. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా బిసీల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మాత్రం పూర్తిగా బిసీలను గాలికి వదిలేశాడు. కానీ వైఎస్సార్ మాత్రం బిసీల కోసం వేరే నాయకుడు చేయని స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు, కులవృత్తులను కాపాడడం కోసం బృహత్తర కార్యక్రమాలు చేశాడు. ఇక ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలతో అన్ని వర్గాల ప్రజల్లాగే బిసీలు కూడా భారీగా లబ్దిపొందారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు మరోసారి బిసీలను గాలికొదిలేశారు. అన్నింటికీ మించి కాపుల కోసం అని చెప్పి బిసీల ప్రయోజనాలకు పూర్తిగా మంగళం పాడేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిసీలందరూ కూడా ఈ సారి వైకాపాకు మద్దతివ్వడానికి సిద్ధపడుతున్నారు. స్వయంగా అధ్యక్షుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిసీలకు ప్రతినిధిగా ఉన్న ఆర్. కృష్ణయ్య జగన్‌ని కలిసి తన మద్దతు తెలియచేశాడు. బిసీల కోసం వైఎస్సార్ చేసిన కార్యక్రమాలను, బిసిల అభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడిన వైనాన్ని వేనోళ్ళ ప్రశంసించాడు. ఇప్పుడు జగన్‌లో కూడా అదే స్థాయి చిత్తశుద్ధి కనిపిస్తోందని జగన్‌ని ప్రశంసించాడు. త్వరలోనే వైకాపా బిసి గర్జన సభకు కూడా ఆర్.కృష్ణయ్య హాజరవనున్నారు. ఆంధ్రప్రదేశ్ కులసమీకరణ లెక్కల ప్రకారం ఎస్సీ,ఎస్టీలు, రెడ్లు, బ్రాహ్మణులు 2019 ఎన్నికల్లో వైకాపాకు అండగా నిలబడడం ఖాయమైపోయింది. ఆ విషయాన్ని స్వయంగా వాళ్ళు సర్వేరాయుళ్ళకు కూడా తేల్చి చెప్పేస్తున్నారు.

ఇక కమ్మలు టిడిపికి మద్దతుగా ఉండనున్నారు. కాపులు మాత్రం జనసేన, టిడిపి, వైకాపా మధ్య చీలనున్నారు. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో బిసీలు పూర్తిగా వైకాపాకు మద్దతు పలికితే మాత్రం వైఎస్సార్సీపీ సర్వేలకు కూడా అందనంత భారీ మెజార్టీ సాధించడం ఖాయం అని విశ్లేషకులు చెప్తున్నారు. రుణమాఫీతో సహా అన్ని హామీల విషయంలోనూ అన్ని వర్గాలవారినీ దగా చేసినట్టుగానే బిసిలను కూడా మోసం చేశాడు చంద్రబాబు. అందుకే ఇప్పుడు బిసీలంతా కూడా జగన్ వెంట నడవడమే సరైన నిర్ణయంగా జాతీయస్థాయిలో కూడా బిసిల ప్రతినిధిగా పేరెన్నికగన్న కృష్ణయ్య లాంటి వాళ్ళు జగన్‌కి మద్దతుగా నిలబడుతుండడంతో 2019 ఎన్నికల్లో టిడిపి ఆయువుపట్టుపై జగన్ దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -