Thursday, April 25, 2024
- Advertisement -

భారత్ బంద్.. అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు!

- Advertisement -

పార్లమెంట్ పాస్ చేసిన అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనను తీవ్రం చేశాయి. ఆలిండియా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలిపాయి. పంజాబ్, హర్యానాల్లో 31 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఇప్పటికే నిరసనలు చేస్తున్నారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ లో గురువారం మూడ్రోజుల రైల్ రోకోను ప్రారంభించారు. రైతుల నిరసనతో ఫిరోజ్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్లను నిలిపివేశారు.

ఈ నెల 24 నుంచి 26 వరకు 14 జతల రైళ్లను బంద్‌జేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రైల్ రోకోతో ఆహార ధాన్యాలు, వస్తువుల రవాణాఫై ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు. ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ అగ్రి బిల్లులను ఆమోదించవద్దని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని తిరిగి పార్లమెంట్ కు పంపాలని కోరుతున్నాయి. మూడు అగ్రి బిల్లులకు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. బిల్లులతో రైతులకు నష్టం కలుగుతుందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

మరో వైపు అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ గురువారం నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, 2కోట్ల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది. అయితే అగ్రి బిల్లు విషయంలో కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రి బిల్లులను వ్యతిరేకించాలనుకుంటే, ముందుగా 2019లో ఆ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలన్నారు.

అచ్చెన్నా కి అంత దమ్ముందా.. దిగజారిపోయిన పార్టీ ని…?

ఏపీ ఆర్టీసీ విషయంలో జగన్ సంచలన నిర్ణయం..!!

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

దివి ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేసిందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -