Friday, March 29, 2024
- Advertisement -

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

- Advertisement -

జగన్ అంటే ఎంతో ప్రాణంగా గౌరవించే ఆ మహిళా మంత్రికి అవమానం జరిగిందా ? అంటే అవును అనే అంటున్నారు వైసీపీ నేతలు. ఈ విషయం పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందట. అసలు విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మేకతోటి సుచరిత వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ప్రధానంగా సీఎం జగన్ అంటే ప్రాణంగా అభిమానిస్తారు ఆమె. పార్టీ కోసం ఎంతో చేశారు. గత ఐదేళ్ళలో పార్టీని డెవలప్ చేయడంలో ఎంతో కృషీ చేశారు. అందుకే ఆమెకు జగన్ గౌరవమిచ్చారు.

ఏకంగా హోంశాఖ పదవిని ఆమెకు అప్పగించారు. ఇంత మంచి పేరు ఉన్న సుచరితకు సొంత జిల్లాలోనే అవమానం జరిందనే వార్తలు ఇప్పుడు పార్టీలో, జిల్లాలో చర్చనీయాంశం అయింది. గూంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల క్రింద ’ఇన్నోవేష‌న్ అండ్ ఇంక్యుబేష‌న్‌` భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగింది. ఇందుకు ఏపీ సర్కారే నిధులు కేటాయించింది. ఇందులో కొంత భాగం కేంద్రం కూడా కేటాయించింది. అయితే ఈ కార్యక్రమంను గ్రాండగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక యూనివ‌ర్సిటీలో ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం రాష్ట్రంలో మొదటిసారి కావడం వల్ల ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఆహ్వాన ప‌త్రాలు ముద్రించారు.

మీడియాకు కూడా ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం యూనివ‌ర్సిటీ ఇంచార్జ్ వైస్ చాన్సెల‌ర్ నేతృత్వంలో సాగింది. ఇదంతా బానే ఉన్న.. ఆ ఆహ్వాన పత్రంలో జిల్లాకు చెందిన ఏకైక మంత్రి సుచరిత పేరు లేకపోవడం ఇప్పుడు వివాదం అయింది. ఉద్దేశపూర్వకంగానే ఆమె పేరు వేయలేదని ఆమె అనుచరలు గొడవ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పార్టీ అధిష్టానం వద్దకు చేరడంతో కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దన్న ఆదేశాలు వచ్చాయట. దాంతో కార్యక్రమం మొత్తం వీసీ చేతుల మీదుగా నిర్వ‌హించారట. మరి మంత్రికి జరిగిన అవమానం మాటేంటన్నది చర్చనీయాంశంగా మిగిలిపోయింది.

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -