Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బ్రేకింగ్: బీజేపీ ధాటికి సంక్షోభం దిశగా టీడీపీ

- Advertisement -

సంక్షోభం దిశగా టీడీపీ సాగుతోంది. చంద్రబాబు విదేశాల్లో ఉండడంతో ఆయనకు ఆర్థిక వెన్నుదన్నుగా ఉన్న బలమైన టీడీపీ ఎంపీలను లాగేసి పనికి బీజేపీ అధిష్టానం తెరతీసింది. ఇప్పుడు టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు తాజాగా ఢిల్లీలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.

టీడీపీ రాజ్యసభ ఎంపీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ లు టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మోడీషాలతో భేటి అయిన వారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి తమను బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని లేఖ ఇవ్వడం.

ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా అద్వర్యం లో తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక కాకినాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, కాపు నేతలు సమావేశమై టీడీపీని వీడి బీజేపీలో చేరాలని చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ఈలినాని, జ్యోతుల నెహ్రూ, మాధవ నాయుడు, వంగాల గీత, బోండా ఉమ, బడేటి బుజ్జి, వరుపుల రాజా తదితర కీలక నేతలతోపాటు కాపు నేతలు కూడా రహస్యంగా సమావేశమయ్యారు.

వైసీపీ దెబ్బకు టీడీపీ 23 సీట్లకే పరిమితమవ్వడం.. భవిష్యత్ లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో వీరంతా టీడీపీనీ వీడేందుకే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అటు నలుగురు రాజ్యసభ సభ్యులు, ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, కాపు నేతలను లాగేసి టీడీపీకి, చంద్రబాబుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ కావడం సంచలనంగా మారింది. ఈ దెబ్బకు టీడీపీ పార్టీనే సంక్షోభంలో చిక్కుకోవడం కాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -