రాజు గారి కి దెబ్బ అదుర్స్ కదూ..

- Advertisement -

వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ నే ముప్పుతిప్పలు పెడుతున్న నర్సాపురం ఎంపీ రఘు రామ రాజుకు తొలి షాక్ తగిలింది.. తానే మారుతాడు లే అని వైసీపీ అధిష్టానం ఇన్నాళ్లు రాజు గారు ఎన్ని వ్యాఖ్యలు చేసిన ఓపిక పట్టింది.. నిజం ప్రజలే తెలుసుకుంటారు.. మన నేతను మనం టార్గెట్ చేస్తే మన పరువు పోతుందని ఊరుకుంటుంటే రఘు రామ రాజు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.. టీడీపీ నేతలు సైతం టార్గెట్ చేయని విధంగా సొంత పార్టీ అధినేత పై విమర్శలు కురిపిస్తూ వచ్చారు.. ఇటీవలే జగన్ త్వరలో జైలుకి వెళతాడని కూడా వ్యాఖ్యలు చేసి వైసీపీ కి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా మాట్లాడాడు..

నిజానికి ఈ వ్యాఖ్యల కన్నా ముందే జగన్ ఆయనపై ఫోకస్ పెట్టి అయన పదవి పోగొడితే కానీ బుద్ధి రాదని కేంద్రం లో అయన ప్రస్తావన తెచ్చారు.. అప్పటికి భయపడలేదు.. దాంతో మొన్న ఢిల్లీ టూర్ లో ఎం జరిగిందో తెలీదు కానీ ఆయన నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవి నుండి ఎంపీ రఘురామ కృష్ణంరాజుని తప్పిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ స్థానంలో సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

వాస్తవానికి వైసీపీ కి అవసరం లేకుండా నే రఘు రామ రాజు తన చేతులతో తానే తన భవిష్యత్ ని నాశనం చేసుకున్నాడు.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మొత్తం 826.17 కోట్ల మొత్తంలో రుణం బకాయి పడ్డారని, దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయన బ్యాంకుకు సరైన సమాధానం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రఘురామకృష్ణంరాజు సహా 9 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవి నుండి తొలగింపడ్డారని తెలుస్తుంది..రఘు రామ రాజు కి ఇక మొదలైనట్లే అని అంటున్నారు ప్రజలు..

రాజు గారు మళ్ళీ వేసేశారు…!

రాజధాని మర్చారానికి ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..?

జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లి ఏం సాధించుకోచ్చారు..?

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

Most Popular

Related Articles

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు అధికారుల భాగోతాలు "అవినీతి రహిత పాలన " అంటున్న ముఖ్యమంత్రి కి తలవంపులు తెస్తున్నాయి. కోట్ల మంది ప్రజల...

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...