జగన్ పై బీజేపీ హిందూ వ్యతిరేక ముద్ర.. వైసీపీ ఏం చేయబోతోంది?

436
BJP Anti-Hindu Seal on AP CM YS Jagan Mohan Reddy… Ambati Rambabu fires
BJP Anti-Hindu Seal on AP CM YS Jagan

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే రీతిలో కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోతున్న బీజేపీని గట్టిగా ఎదుర్కోవడానికి వైసీపీ రెడీ అయినట్టు కనిపిస్తోంది. బీజేపీ కొద్ది రోజులుగా జగన్ ను, ఆయన మత విశ్వాసాల ఆధారంగా హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జగన్ హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై తాజాగా వైసీపీ సీనియర్ అయ్యింది.

అమెరికాలో జ్యోతి ప్రజ్వళన చేయలేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అక్కడ ఎలక్టానిక్ పరికరాల ద్వారా జ్యోతులు వెలిగిస్తారని.. జగన్ అదే చేశారని వివరించారు.

బీజేపీలోకి నలుగురు టీడీపీ ఎంపీలు వెళ్లాక వాళ్లు వైసీపీని టార్గెట్ చేసి బీజేపీకి-వైసీపీకి మధ్య చిచ్చు పెడుతున్నారని.. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ అంటూ అంబటి సంచలన కామెంట్ చేశారు. ఏపీలో కమల వనం .. పచ్చవనంగా మారుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు టీడీపీని నమ్మి వెళితే ముంచేస్తారంటూ అంబటి హెచ్చరించారు.

ఇలా కేంద్రంలోని బీజేపీ పెద్దలు, రాష్ట్రంలోని నేతలు కలిసి ఇప్పుడు జగన్ కు హిందూ వ్యతిరేక ముద్ర వేస్తున్నారని వైసీపీ అధిష్టానం గుర్తించినట్టైంది. దానికి ప్రతిగానే అంబటి కౌంటర్లు ఉన్నాయి. మరి మున్ముందు బీజేపీ ఈ ఎత్తులను వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది అనేది వేచిచూడాల్సిందే..

Loading...