Thursday, April 25, 2024
- Advertisement -

2024లో భాజాపా సీఎం అభ్యర్థి పవన్ ..? భాజాపా నేతల సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

సీఎం జగన్ ను ఎదుర్కొనేందుకు ఏపీలో టీడీపీ,జనసేన,భాజాపాలు ఏకమవతున్నాయి. జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దమవుతున్నాయి. రాజధాని పర్యటనలో పవన్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధానిని మారుస్తే ప్రధాని మోదీ, అమిత్ షాను కలుస్తానని ప్రకటించారు. అంతేకాదు ఇద్దరిని ప్రశంసలతో ముంచెత్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ లో మార్పు.

కొద్ది రోజులుగా జనసేనను పవన్ భాజాపాలో విలీనం చేస్తారనె వస్తున్న వార్తలను పవన్ ఖండించారు. తాను జనసేనను ఏపార్టీలో విలీనం చేయనని ప్రకటించారు.కొద్ది రోజులుగా పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రధాని మీద ఘాటుగా విమర్శలు చేసిన పవన్..ఇప్పుడు ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జగన్ ను ఢీ కొట్టాలంటే పవన్ వల్ల సాధ్యం కాదన్నది అందరికి తెలిసిందే. అంతేకాదు బలమైన క్యాడర్ , ఆర్థిక స్థోమత లేదు. జాతీయ పార్టీ మద్దతు అవసరం. ఏపీలో పాగా వేయాలని చూస్తున్న భాజాపాకు పవన్ మద్దతు చాలా అవసరం.

తానా సభల సమయంలో అమెరికాలో బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ జనసేన అధినేత పవన్ తో కీలక భేటీ జరిగింది. ఆ తరువాత పవన్ వ్యాఖ్యల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీలో ఎమ్మెల్సీ గా ఉన్న అన్నం సతీస్ తన పదవికి రాజీనామా చేసి భాజాపాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేసన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ కలకలం రేపుతున్నాయి.బీజేపీ సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాన్ అంటూ.. డిసెంబర్ లోగా జనసేన బీజేపీలో విలీనం అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తారని..ఆయన కోసం ఢిల్లీ నాయకులు సైతం ఏపీకి వస్తారని చెప్పుకొచ్చారు

పార్టీ విలీనం చేయగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారని..చిరంజీవి బీజేపీ లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీటి మీద ఏపీలో రాజకీయంగా ఆసక్తి కర చర్చ మొదలైంది.బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని… ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు.ఢిల్లీ నేతలు పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ జగన్ కు అటు బీజేపీతో..ఇటు కేసీఆర్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.రాజధాని తరలిస్తే మోదీ..అమిత్ షా ను కాదన్నట్లే అంటూ కొత్త భాష్యం తెర మీదకు తెచ్చారు.

ఏపీలో భాజాపా వ్యూహాత్మకంగా ముందుకెల్తున్నట్లు కనిపిస్తోంది. పవన్, చిరును పార్టీలోకి లాగేందుకు ఆచి తూచి అడుగులు వేస్తోంది.రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్న చిరంజీవి బీజేపీ లోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే చేసినట్లు కనిపిస్తోం.

తాజాగా అన్నం సతీష్ చేసిన కామెంట్స్… ఈ ప్రచారానికి బరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనా ఇప్పుడు అన్నం సతీష్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ జనసేన అభిమానులు, నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -