Friday, April 19, 2024
- Advertisement -

ఏపీ రాజధాని మారుతుంది…భాజాపా ఎంపీ సంలన వ్యాఖ్యలు…?

- Advertisement -

ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలిస్తారనే ఊహాగానాతో గత కొద్ది రోజులుగా రాజకీయాలు వేడెక్కాయి. దీనిమీద టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనె ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు రాజధాని మార్పునకు ఊతమిస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మారుస్తుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసరాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తాజాగా రాజధాని మార్పుపై భాజాపా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

రాజధాని మార్పు కచ్చితంగా జరగబోతోందని.. అమరావతిలో రాజధాని కొనసాగించే యోచనలో వైసీపీ లేదని.. ప్రకాశం జిల్లాకు రాజధాని తరలించే అవకాశం ఉందని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ అధిష్టానానికి దగ్గరగా ఉండే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీఎల్ నరసింహారావు చేసినట్టుగా ప్రచారంలో ఈ వ్యాఖ్యలను బట్టి… ప్రకాశం జిల్లా దొనకొండలో ఏపీ రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని మరోసారి చర్చ మొదలైంది.

రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? అమరావతి భవిష్యత్తు ఏమిటనే విషయంలో తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -