Thursday, April 25, 2024
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుజనా చౌదరి…

- Advertisement -

ఏపీలో అధికారం కోల్పోవడంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనంతో రగిలిపోతున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి పాలనలో ముందుకు దూసుకుపోతున్నారు. జగన్ అందిస్తున్న పాలనను చూసి బాబు ఓర్వలేక పోతున్నారు. ఎన్నికలు జరిగి నాలుగైదు నెలలు కాకముందే మరో సారి ఎన్నికలు రావాలని బాబు ఉబలాట పడుతున్నారు.

రెండు రోజుల క్రిందట ముందస్తు ఎన్నికలపై బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయని వెల్లడించారు.కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు అయినంతలోనే చంద్రబాబు నాయుడు ఎన్నికలు అంటూ అప్పుడే మొదలెట్టేశారు. దేశ వ్యాప్తంగా ఒకే సారి జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. ఆ విషయంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బాబు మాత్రం త్వరలోనె ఎన్నికలంటూ సంబరపడుుతన్నాడు.

అయితే బాబు చేసిన వ్యాఖ్యలను ఇటీవలె భాజాపా లో చేరిన బాబు నమ్మిన బంటు సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని తెలిపారు.

తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యమే ట్రాక్ తప్పిందంటూ చెప్పుకొచ్చారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా కాలయాపన చేయడంతో ట్రాక్‌ తప్పిందని ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -