Friday, April 26, 2024
- Advertisement -

రెండు రాష్ట్రాల్లో పొత్తుపై క్లారిటి ఇచ్చిన భాజాపా…..

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలలో ప‌లు ఆస‌క్తికర‌మైన విష‌యాలు చోటు చేసుకంటున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అన్ని పార్టీలు ఒంట‌రి పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నాయి. ప్ర‌ధానంగా భాజాపా ద‌క్షిణాదిపై దృష్టిసారించింన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీ,తెలంగాణ‌లో భాజాపా -టీడీపీ పొత్తు కొన‌సాగుతోంది. పైకి క‌ల‌సి ఉన్నా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు భాజాపా నేత‌లు బ‌హిరంగంగానె టీడీపీ విమ‌ర్శ‌లు ఎక్కుపెడ్తుంటారు.

తెలంగాణాలో మాత్రం భాజాపా-టీడీపీ రెండుపార్టీ దూరం పెరిగింద‌నే చెప్పాలి. కాని ఏపీలో మాత్రం బ‌ల‌వంతంగా క‌లిసే ఉంటున్నాయి. అయితే తాజాగా వ‌చ్చె ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై భాజాపా జీతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్‌రావు క్లారిటి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలతోపాటు తమిళనాడు పరిస్థిపైనా ఆయన ఆసక్తికర అంశాలను ఓఛాన‌ల్‌తో పంచుకున్నారు.

భాజాపాతో క‌లిసుండాల‌నె ఆలోచ‌న బాబుకు లేద‌న్నారు.. చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమతో కలిసుండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భావించడం లేదని మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో దాదాపు వీరి మ‌ధ్య బంధం తెగిపోయిన‌ట్లేని భావించాలి.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెలిపార‌ని దాంతో టీడీపీలో అనుమానం మొద‌ల‌య్యింద‌న్నారు. అందుకె రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన కారణంగా టీడీపీ వాళ్లు అనుమానిస్తున్నారని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి క‌లిసే ఉంటార‌నె గ్యారెంటీ మాత్రం క‌న‌ప‌డ‌టంలేదు.

టీడీపీతో అంతవరకే.. రాజకీయాలు ఎప్పుడూ ఏడేడు జన్మల బంధంలా ఉండవని, టీడీపీతో తమ బంధమూ అంతేనని మురళీధర్ రావు స్పష్టం చేశారు. రెండు వేర్వేరు పార్టీలుగా ఎవరి లక్ష్యాలు వాళ్లకు ఉన్నాయన్నారు.తెలుగుదేశం కారణంగా ఏపీలో బీజేపీ ఎదగదేమోనన్న ఆందోళన తమకు లేదని స్పష్టం చేశారు. నేత‌ల‌ను కేసీఆర్ లాగా కొనుగోలు చేయ‌డంల‌దేనివిమ‌ర్శించారు. స్థానిక భాజాపా నాయ‌క‌త్వం మాత్రం పొత్తుపై వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణ‌యంతో బ‌ల‌వంత‌పు కాపురం చేస్తున్నారు. ఈ బ‌ల‌వంత‌పు కాపురం ఎన్నాళ్లు చేస్తారొ చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -