Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీ కి చెక్ పెట్టేవిధంగా బీజేపీ సరికొత్త ప్లాన్స్..!!

- Advertisement -

గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మధ్యకు దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే.. గతంలో ఎంత పెద్ద సమస్య అయినా స్పందించడానికి పెద్దగా ఉత్సాహం చూపించని కమలనాథులు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎప్పుడెప్పుడు సమయం దొర్కుతుందా అని వేచిచూస్తున్నారు.. అమరావతి విషయంలో టీడీపీ కన్నా ఎక్కువగా బీజేపీ చేసిన పోరాటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. టీడీపీ కి అంటే ఓ ప్రయోజనం ఉంది కాబట్టి పోరాడింది, బీజేపీ ప్రజలకోసమే ఆ ఉద్యమంలో చాలా సీరియస్ గా ముందు కెళ్ళింది అని ఇప్పటికే టాక్ వచ్చిన నేపథ్యంలో అవి బీజేపీ కి శుభ గడియలు అని చెప్పాలి..

వచ్చే ఎన్నికలనాటికి అధికారంలోకి రావాలని కోరిక ఉన్న బీజేపీ కి ఈ టాక్ రావడం వారికెంతో బలం చేకూర్చింది అని చెప్పాలి.. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక వచ్చిన ఈ మార్పు అందరు స్వాగతిస్తున్నారు.. అయితే ఈ మార్పు టీడీపీ కి ఒకింత భయాన్ని కలుగజేస్తుందని తెలుస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయి అసలే కష్టాల్లో ఉన్న టీడీపీ కి తమ రెండో పొజిషన్ ఎక్కడ చేజారిపోతుందో అన్న టెన్షన్ ఇప్పుడు ఎక్కువయిపోయిందట..  బీజేపీలోకి వెళ్లిన టీడీపీ నేతల నోళ్లు సోము రాకతో ఇప్పటికే మూగబోయాయి.. నిన్న మొన్నటి వరకు బీజేపీని తన తోక పార్టీగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ సొంతంగా ఎదగడం ఏ మాత్రం రుచించడంలేదు. ఈ పరిణామం తమ కొంప ముంచుతుందని టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

ఇక బహిరంగంగా కూడా టీడీపీ నేతలను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు..  తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు విజయవాడ క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే వాట్స్‌ప్‌ గ్రూపు ద్వారా టీడీపీ నేతలు తమ పార్టీకి నష్టం చేకూర్చేలా పోస్టులు రాస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసుల రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఓ వైపు వైసీపీ, మరోవైపు బీజేపీ టీడీపీ ని టార్గెట్ చేసి ఇలా చేయడం తో చంద్రబాబు కి ఇప్పటినుంచే కొంత ఆందోళన మొదలవుతుంది.  మళ్ళీ అధికారంలో కి వచ్చేందుకు వైసీపీ, ఎలాగైనా అధికారం లోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టీడీపీ వారిని తట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు వేస్తుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -