Friday, April 19, 2024
- Advertisement -

బీజేపీ ఆపరేషన్ ‘ఏపీ’ లో కొత్త కోణం

- Advertisement -

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ‘ఆపరేషన్ ఏపీ’ మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తెలుగు వ్యక్తి బీజేపీ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ ను ఇన్ చార్జిగా నియమించినట్టు సమాచారం. ఆయన ఇప్పటికే పలు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేశారు. ఇప్పుడు ఆపరేషన్ ఏపీని కూడా చేపట్టబోతున్నట్టు సమాచారం.

2024 వరకు ఏపీలో బీజేపీ బలోపేతం చేసి.. టీడీపీని నామరూపాల్లేకుండా చేయడంపై కేంద్రంలోని బీజేపీ స్కెచ్ గీసినట్టు సమాచారం. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే బీజేపీ ఏపీలో దెబ్బతినడానికి కారణంగా చెప్పారు. చంద్రబాబు బీజేపీని టార్గెట్ చేసి అసత్యాలు ప్రచారం చేయడమే బీజేపీని ఎన్నికల్లో దెబ్బతీసింది విశ్లేషించారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము బలపడుతామన్న భావనను రాంమాధవ్ వ్యక్తం చేశారు.

అందుకే ఇప్పుడు ఏపీలో బలపడడానికి బీజేపీ ముందున్న దారి ఒక్కటే.. అదే ‘ప్రత్యేక హోదా’. ఈ హోదాను ఇస్తే ఇటు బీజేపీ బలం పుంజుకోవచ్చు. అటు టీడీపీ నుంచి నేతలను లాగేసి ఆ పార్టీని దెబ్బతీయవచ్చు. ఈ రెండు వ్యూహాలతోనే ప్రస్తుతం బీజేపీ ఏపీలో ఆపరేషన్ మొదలు పెట్టబోతోందని రాంమాధవ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

ప్రత్యేక హోదా కోసం ప్రధానితో చర్చించి.. 14వ ఆర్థిక సంగం సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామని రాంమాధవ్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి హోదాపై బీజేపీ సానుకూలంగా ఉందని.. రాజకీయ ప్రయోజనం కూడా ఏపీకి ఇచ్చే ఆలోచన చేస్తోందని అర్థమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -